ఇంతకీ హీరో ఎవరు?

Update: 2019-08-05 06:08 GMT
ఇంకో పది రోజుల్లో విడుదల కానున్న ఎవరు ట్రైలర్ ఇవాళ వచ్చేసింది. నిర్మాతలు మరీ ఓపెన్ గా ఇది ఇన్విజిబుల్ గెస్ట్ రీమేక్ అని చెప్పకపోయినా ఆల్రెడీ బాలీవుడ్ లో చూసేసిన బదలా తాలూకు ఛాయలు స్పష్టంగా కనిపించడంతో ఇది అదే అని సినిమా లవర్స్ ఫిక్స్ అయ్యారు. అయితే ఆ రెండు మూవీస్ అందరూ చూసి ఉంటారన్న గ్యారెంటీ లేదు కాబట్టి కంటెంట్ మీద నమ్మకంతో ఎవరు తీసుండొచ్చు. అదలా ఉంచితే ట్రైలర్ లో బాగా హై లైట్ అయిన అంశాలను గమనిస్తే ఇందులో హీరో రెజీనానా లేక అడవి శేషా అనే అనుమానం రాక మానదు.

ఎందుకంటే ట్రైలర్ లో ఎక్కువ సేపు కనిపించింది రెజీనానే. పెర్ఫార్మన్స్ పరంగా తనకు బాగా స్కోప్ దక్కినట్టు కనిపిస్తోంది. శేష్ గత రెండు సినిమాలు గూఢచారి-క్షణంలలో షో అంతా తనదే. మిగిలిన పాత్రలు ఎన్ని ఉన్నప్పటికీ కథలోని మెయిన్ లింక్ తన చుట్టూ ఉండేలా స్వతహాగా రచయిత అయిన శేష్ జాగ్రత్త పడ్డాడు.  కానీ ఎవరులో అలా కనిపించడం లేదు. భారమంతా రెజీనా మీద పడినట్టు ఉంది. బదలాలో సైతం తాప్సిదే కీ రోల్. అమితాబ్ బచ్చన్ ఉన్నప్పటికీ కేంద్ర బిందువుగా తాప్సినే ఉంటుంది.

మరి ఎవరులో శేష్ పాత్రను లాయర్ కు బదులుగా లంచాలు తీసుకునే పోలీస్ గా మార్చినట్టు కనిపిస్తోంది. శేష్ సినిమాలకు మరీ భారీ ఓపెనింగ్స్ వచ్చేంత ఇమేజ్ లేదు. టాక్ బాగుంటే పెట్టుబడి వెనక్కు వచ్చేలా పాజిటివ్ టాక్ సహాయంతో చేస్తాడు. కంటెంట్ ఏ మాత్రం తేడా ఉన్నా లెక్కలు మారిపోతాయి. రెజీనా అసలే ఫామ్ లో లేదు. శేష్ రెగ్యులర్ గా సినిమాలు చేయకపోవడం మాస్ కు కనెక్ట్ అవ్వడంలో ప్రాబ్లమ్ గా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో బాక్స్ ఆఫీస్ వద్ద ఎవరు సవారి అయితే అంత సులభంగా ఉండేలా మాత్రం లేదు
Tags:    

Similar News