జార్జిరెడ్డి వెన‌క ఆ షాడో ఎవ‌రు?

Update: 2019-11-18 09:19 GMT
ఉస్మానియా విద్యార్థి నాయకుడు.. ఫిజిక్స్ గోల్డ్ మెడ‌లిస్ట్ `జార్జిరెడ్డి` జీవిత క‌థ అధారంగా ఆ పేరుతోనే ఓ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. అంత‌కు ముందే ర‌క‌ర‌కాల వివాదాలు వేడెక్కిస్తున్నాయి. అఖిల భార‌త‌ విద్యార్థి ప‌రిష‌త్ (ఏబీవీపీ) నాయ‌కులు ఈ మూవీ రిలీజ్ పై అభ్యంత‌రం  వ్య‌క్తం చేస్తున్నారు. ఏబీవీపీ విద్యార్ధుల‌ను రౌడీలుగా చూపించే కుట్ర చేస్తున్నార‌ని జార్జిరెడ్డి చిత్ర ద‌ర్శ‌కుడిపై తాజాగా ఆరోప‌ణ‌లు గుప్పించ‌డం చ‌ర్చ‌కొచ్చింది. జార్జిరెడ్డిలోని మంచినే కాదు...చెడు కోణం కూడా ఉంద‌ని దాన్ని కూడా హైలైట్ చేయాల‌ని డిమాండ్ల ప‌ర్వం మొద‌లైంది. జార్జిరెడ్డిపై దాదాపు 15 క్రిమిన‌ల్ కేసులున్నాయ‌ని.. ఆయ‌న రౌడీయిజాన్ని తెర‌పై చూపించే ద‌మ్ముందా? అని ఏబీవీపీ నాయ‌కులు ప‌్ర‌శ్నిస్తున్నారు.

ఏక ప‌క్షంగా ఏబీవీపీ విద్యార్ధుల‌నే టార్గెట్  చేసి లేనివి ఉన్న‌ట్లు చూపిస్తే సినిమాను అడ్డుకుంటామ‌ని హెచ్చ‌రించారు. దీనిపై ద‌ర్శ‌కుడు వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసాడు. త‌మ సినిమాలో వాస్త‌వాలే చూపుతామ‌ని.. వ్య‌క్తిగ‌తంగా ఎవ‌రినీ టార్గెట్  చేయ‌లేద‌ని అన్నాడు. ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం  కూడా వెలుగులోకి వ‌చ్చింది. ఈ సినిమా ప్ర‌చారానికి జ‌న‌సేన అధినేత‌.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌పోర్ట్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే జ‌న‌సేన లో ఉన్న ఓ కీల‌క వ్య‌క్తి ఈసినిమాకు ఫైనాన్స్ చేసిన‌ట్లు వినిపిస్తోంది. అందుకే ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజ‌ర‌వ్వ‌డానికి ఆస‌క్తిచూపించిన‌ట్లు ప్ర‌చారం సాగుతోంది.

అటు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌కు.. అభిమానుల‌కి సినిమాను ఆద‌రించాల‌ని మెసెజ్ లు వెళుతున్నాయ‌ట‌. అయితే ఎన్ని మెసేజ్ లు వెళ్లినా? ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌హ‌క‌రించినా ఇలాంటి సినిమాలు ఆంధ్రాలో ఆడ‌టం క‌ష్ట‌మ‌ని అంటున్నారు. లీడ‌ర్ షిప్... ఉద్య‌మం నేప‌థ్యం గ‌ల సినిమాల‌కు అక్క‌డ ఆడియ‌న్స్ పెద్ద‌గా క‌నెక్ట్ కార‌ని టాక్ వినిపిస్తోంది. అక్క‌డి ప్రేక్ష‌కులు కేవలం ఎంట‌ర్ టైన్ మెంట్ బేస్ సినిమాల‌కే పెద్ద పీట వేస్తారు త‌ప్ప‌.. ఇలాంటి వాటిని ఎంక‌రేజ్ చేయ‌ర‌నే అంటున్నారు. ఈ సినిమ‌లో పెద్ద స్టార్ కాస్టింగ్ ఉందా? అదీ లేదు. అన్నీ కొత్త ముఖాలు. క‌నీసం విజ‌య్ దేవ‌ర‌కొండ‌లాంటి ఛ‌రిష్మా ఉన్న హీరో  చేసినా  ఎంతో కొంత ఆడియ‌న్స్ కి  చేరువ‌య్యేది అని అంటున్నారు.  వీట‌న్నింటికి మించి సినిమాకు ప్ర‌మోష‌న్ కూడా వీక్ గా క‌నిపిస్తోంది. ప్ర‌మోష‌న్  కేవ‌లం ట్విట‌ర్- ఫేస్ బుక్ ల‌కే ప‌రిమిత‌మైంది. మ‌రి ఇలాంటి ప్ర‌తికూల ప‌రిస్థితులు.. వీక్ ప్ర‌మోష‌న్ న‌డుమ `జార్జిరెడ్డి` ఎలాంటి ఓపెనింగ్స్ తెస్తుందో చూడాలి.
Tags:    

Similar News