ఆ సినిమా తర్వాత చైతు ఎవరితో ?

Update: 2019-08-13 06:52 GMT
ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో వెంకటేష్ తో కలిసి 'వెంకీ మామ' సినిమా చేస్తున్నాడు చైతు. ఈ సినిమా షూటింగ్ స్టేజిలో ఉంది. సినిమాలో మామ అల్లుళ్లుగా కనిపిస్తూ ఎంటర్టైన్ చేయబోతున్నారు. జెట్ స్పీడ్ లో ఫినిష్ చేసి దసరాకి ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ టైం చైతు తో కలిసి వెంకీ ఫుల్లెంత్ చేస్తున్నాడు. 'జై లవకుశ' తర్వాత బాబీ చేస్తున్న సినిమా ఇది.

అయితే ఈ సినిమా తర్వాత వెంటనే శేఖర్ కమ్ములతో సినిమా చేస్తాడు చైతు. ఈ నెలలో సినిమా సెట్స్ పైకి వస్తుందని తెలుస్తుంది. అయితే చైతు కోసం తను రాసుకున్న ఓ కథను మళ్లీ మార్పులు చేసి సినిమా చేస్తున్నాడు శేఖర్ కమ్ముల. చైతు సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా తర్వాత చైతు కి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. వాటిలో ముందిగా ఇది స్టార్ట్ చేస్తాడా..? అని ఎదురుచూస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్.

నిజానికి చైతు నెక్స్ట్ మెర్లపాక గాంధీ తో యూ.వీ.క్రియేషన్స్ లో ఓ సినిమా చేయాలి. అలాగే దిల్ రాజు బ్యానర్ లో శశి అనే దర్శకుడితో కూడా సినిమా ఉంది. ఈ రెండు కాకుండా మరో రెండు కథలు ఫైనల్ అయ్యాయని తెలుస్తుంది. సో మరి అక్కినేని యంగ్ హీరో ముందుగా యూ.వి కె సినిమా చేస్తాడో..లేదా దిల్ రాజు కి డేట్స్ ఇస్తాడో..చూడాలి.




Tags:    

Similar News