అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో వంటి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ తర్వాత నటిస్తున్న సినిమా అవ్వడంతో పుష్పపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఇక దర్శకుడు సుకుమార్ కూడా రంగస్థలంతో ఇండస్ట్రీ హిట్ కొట్టి రెండేళ్లు అనివార్య కారణాల వల్ల గ్యాప్ తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
ఇండస్ట్రీ హిట్స్ దక్కించుకున్న ఇద్దరి కలయికలో వస్తున్న పుష్ప చిత్రం అంతకు మించి ఉంటుందనే నమ్మకంను ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఫస్ట్ లుక్ విడుదల సమయంలోనే అయిదు భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా క్లారిటీ ఇచ్చారు.
సినిమా స్థాయిని పెంచే ఉద్దేశ్యంతో ప్రతి ఒక్క నటీనటుల విషయంలో సుకుమార్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది. ముఖ్యంగా విలన్ విషయంలో దర్శకుడు సుకుమార్ చాలా ఆలోచిస్తున్నాడట. పాన్ ఇండియా గుర్తింపు ఉన్న నటుడు విలన్ గా ఈ చిత్రంలో నటిస్తే బాగుంటుందనే అభిప్రాయంతో సుక్కు ఉన్నాడట. అందుకే బాలీవుడ్ కు చెందిన సంజయ్ దత్.. సునీల్ శెట్టిలతో పాటు జాకీ ష్రాఫ్ ఇంకా కొంత మంది స్టార్స్ ను కూడా ఆయన సంప్రదించాడని తెలుస్తోంది.
పుష్ప చిత్రంలో కీలక పాత్రకు గాను ఇప్పటికే విజయ్ సేతుపతిని తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. విజయ్ సేతుపతి నెగటివ్ షేడ్స్ ఉండే పోలీసు పాత్రలో కనిపించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇంకా ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే మెయిన్ విలన్ విషయంలో కూడా సుకుమార్ త్వరలోనే ఒక నిర్ణయానికి వస్తాడని యూనిట్ సభ్యులు అంటున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ ఇప్పటికే పూర్తి అయ్యింది. రెండవ షెడ్యూల్ ను కేరళలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన సమయంలో లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా వేశారు. లాక్ డౌన్ ఎత్తి వేసిన వెంటనే కేరళలో షూటింగ్ ను మొదలు పెట్టేందుకు సుకుమార్ రెడీగా ఉన్నాడు.
బన్నీ కూడా మరే కార్యక్రమం పెట్టుకోకుండా పుష్ప చిత్రం కోసం పూర్తిగా టైంను కేటాయిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సమయంలో స్క్రిప్ట్ కు మరింతగా మెరుగులు దిద్దే పనిలో సుక్కు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తుంది.