సినీ పరిశ్రమలో కాస్టింగ్ డైరెక్టర్లది కీలక పాత్ర. ఒక సినిమాలో పదుల సంఖ్యలో నటీనటులుంటారు. అందులో రచయితలు.. దర్శకులు ప్రతి పాత్రకూ పర్టికులర్ గా నటీనటుల్ని అనుకోరు. ఎంచుకోరు. సగం పాత్రల్ని ఫిల్ చేసేది ఈ కాస్టింగ్ డైరెక్టర్లే. దీన్ని అవకాశంగా ఉపయోగించుకుని వాళ్లు అకృత్యాలకు పాల్పడుతుంటారన్న విమర్శలు ఎప్పట్నుంచో ఉన్నాయి. చిన్న స్థాయి నటీనటుల నుంచి కమిషన్లు తీసుకోవడం.. అమ్మాయిల్ని లైంగికంగా వేధించడం లాంటి పనులు చేస్తుంటారని కాస్టింగ్ డైరెక్టర్ల మీద ఆరోపణలున్నాయి. ఐతే ఇప్పుడో వ్యక్తి ఈ కాస్టింగ్ డైరెక్టర్ ముసుగు వేసుకుని బిజినెస్ మొదలుపెట్టేశాడు. అతడి పేరు సంజయ్. శేఖర్ కమ్ముల కొత్త సినిమాలో ఛాన్స్ ఇస్తానంటూ అతను డబ్బులు వసూలు చేస్తున్న వైనం ఇటీవలే వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
విషయం తెలిసిన కమ్ముల వెంటనే స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేసి ఈ మోసగాడి ఆట కట్టించాడు. ఈ సందర్భంగా కమ్ముల ఫేస్ బుక్ లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇలాంటి వాళ్ల మాయలో పడొద్దని చెప్పాడు. ‘‘సంజయ్ అనే వ్యక్తి కాస్టింగ్ డైరెక్టర్ పేరుతో ప్రకటనలు ఇచ్చి డబ్బులు వసూలు చేస్తున్నాడని నా దృష్టికి వచ్చింది. బాధితుల్లో ఒకరైన, ఒంగోలుకి చెందిన ప్రదీప్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి మా ఆఫీస్ కి వచ్చి, ఈ విషయాన్ని మాకు తెలియజేశాడు. వెంటనే స్పందించిన పోలీసులకు ధన్యవాదాలు నేను వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇచ్చాను. ఒక వారంలోనే ఈ మోసగాడిని సైబర్ పోలీసులు పట్టుకున్నారు. అవకాశాలు ఇప్పిస్తామని డబ్బులు డిమాండ్ చేస్తే నమ్మకండి. నిజానికి ఏదైనా పాత్రకు ఎంపికైతే మేమే డబ్బులిస్తాం. నా సినిమాలకు సబంధించి నటీనటుల ఎంపికను నేను.. నా డైరెక్షన్ టీమే చూసుకుంటాం. మా నుంచి కాల్ వస్తేనే నమ్మండి. ఇంకెవరు మోసం చేయాలని చూసినా జాగ్రత్త’’ అని కమ్ముల స్పష్టం చేశాడు.