హీరోగానే కాదు నిర్మాతగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన అభిరుచి ఉందని.. అది ఆడియన్స్ చేత కూడా మెప్పించబడుతుందని ప్రూవ్ చేశాడు నేచురల్ స్టార్ నాని. ఎంచక్కా హీరోగా సినిమాలు చేసి హిట్టో ఫట్టో నష్టమైతే పెద్దగా ఉండదు కదా అని కూర్చోవచ్చు. కానీ నిర్మాతగా మారి సినిమాలు చేయాలన్న ఆలోచన వచ్చింది. ఆలోచన రావడమే ఆలస్యం వాల్ పోస్టర్ సినిమాస్ ని స్థాపించి ప్రశాంతితో కలిసి నాని సినిమాలు చేస్తూ వస్తున్నాడు. రీసెంట్ గా మీట్ క్యూట్ అంటూ తన సోదరి డైరెక్షన్ లో ఒక ఆంథాలజీ కాన్సెప్ట్ మూవీ నిర్మించగా అది సోనీ లివ్ లో రిలీజ్ చేశ్శారు నాని.
ఇక లేటెస్ట్ గా హిట్ 2 అంటూ హిట్ ఫస్ట్ కేస్ ని కొనసాగిస్తూ తీశారు. ఈ సినిమా టైం లో తనని చాలామంది భయపెట్టారు అసలు ఇలాంటి సినిమాలు ఎవరైనా చూస్తారా అనవసరంగా రిస్క్ చేస్తున్నావని అన్నారు నాని. అయినా సరే ఆడియన్స్ మీద ఉన్న నమ్మకంతో మంచి సినిమా తీస్తే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే కాన్ఫిడెన్స్ తో ఈ మూవీ చేశానని అన్నారు నాని. అయితే నానిని నిర్మాతగా వెనక్కి లాగే ప్రయత్నమా లేక రిస్క్ ఎందుకు అని జాగ్రత్త చెప్పే ప్రయత్నమా అన్నది తెలియదు కానీ నానిని కొందరు నిజంగానే నిర్మాతగా జాగ్రత్త అని భయపెట్టారట.
అయితే అవేవి నాని పట్టించుకోకుండా తనకు నచ్చిన కథ నిర్మించాడు. ఈ సినిమాలో హీరోగా నటించిన అడివి శేష్ గురించి కూడా నాని బాగా మాట్లాడారు. అడివి శేష్ మంచి నటుడు ప్రతి సినిమాకు బాగా కష్టపడతాడు అందుకే అతని సక్సెస్ గ్రాఫ్ అలా ఉందని అన్నారు. హిట్ మల్టీవర్స్ ని కొనసాగించే ఆలోచనలో ఉన్నారు నాని. హిట్ ఫస్ట్ కేస్ హిట్ అయ్యింది.. హిట్ సెకండ్ కేస్ దాన్ని మించి సక్సెస్ అయ్యింది. ఇక నెక్స్ట్ ఇయర్ హిట్ 3 రాబోతుంది. అందులో హీరోగా ఎవరు చేస్తున్నారు అన్నది ఆల్రెడీ సినిమా చూసిన అందరికి తెలిసిపోయింది. మరి హిట్ 3 కోసం నాని డబుల్ డ్యూటీ ఎలా చేస్తాడన్నది చూడాలి.
నిర్మాతగా కూడా నాని సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ప్రశాంత్ వర్మ చెప్పిన కథ నచ్చి అ! తీశాడు.. ఆ తర్వాత శైలేష్ చెప్పిన హిట్ తో హిట్ ఫస్ట్ కేస్ తీశారు. ప్రస్తుతం దాన్ని కొనసాగిస్తున్నారు. హిట్ దాదాపు ఏడు భాగాలుగా తీస్తారట. హిట్ ఫ్రాంచైజ్ లో టాలీవుడ్ స్టార్స్ కూడా నటించేలా ప్రయత్నాలు చేస్తున్నారు నాని.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.