సినీ వేదికపై ఊహించని ఘటన నగ్నంగా నిలబడిన నటీమణి ప్రధానికి విజ్ఞప్తి..!
హాల్ మొత్తం కిక్కిరిసిపోయింది.. ప్రముఖలంతా ఆసీనులై ఉన్నారు.. ఈ క్రమంలో ఆహ్వానం అందుకున్న ఓ నటి.. వేదికపైకి ఎక్కారు. మైక్ తీసుకొని కాసేపు మాట్లాడిన ఆమె.. అందరూ చూస్తుండగా తన దుస్తులు మొత్తం విప్పేశారు. నగ్నంగా నిలబడి.. ''ఇంతకంటే కోల్పోయేది ఏదీ లేదు''అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. ఇది చూసిన వారంతా నిచ్చేష్టులయ్యారు. మరికొందరు మాత్రం ఆమెను అర్థం చేసుకున్నారు! ఇదంతా.. ఎక్కడ, ఎందుకు జరిగిందంటే..?
ఫ్రాన్స్ దేశంలో ఆస్కార్ తో సమానంగా భావించే సీజర్ అవార్డుల వేడుక శుక్రవారం నిర్వహించారు. ఇందులో భాగంగా బెస్ట్ క్యాస్టూమ్స్ విభాగంలో అవార్డు అందించడానికి కోరిన్ మాసిరో అనే 57 సంవత్సరాల నటిని వేదికపైకి ఆహ్వానించారు. అయితే.. ఎవరూ ఊహించని విధంగా.. నెత్తుటితో తడిసిన గాడిద ఎలా ఉంటుందో అలా మేకప్ చేసుకొని గాడిద బొమ్మను తలపై తగిలించుకొని స్టేజ్ ఎక్కారు మాసిరో.
కాసేపు మాట్లాడిన ఆమె.. తాను నగ్నంగా మారిపోతున్నాను అని చెప్తూ తన దుస్తులు మొత్తం విప్పేశారు. పారిస్ ఒలింపియా కచేరీ హాల్ లో ''సంస్కృతి లేదు.. భవిష్యత్ లేదు'' అని నినదించారు. ఇలా ఎందుకు చేశారంటే.. కరోనా ఉధృతి కారణంగా.. మూడు నెలలకు పైగా ఫ్రాన్స్ లో థియేటర్లు మూసేశారు. దీంతో.. ఆ రంగంపై ఆధారపడిన వారికి జీవనోపాధి లేకుండా పోయింది. ఇదే విషయమై గత డిసెంబరులో వేలాది మంది సినీ కార్మికులు పారిస్ తోపాటు ఇతర నగరాల్లో నిరసన తెలిపారు.
తాజాగా.. కోరిన్ మాసిరో నగ్నంగా నిరసన తెలపడం విశేషం. తన శరీరం మొత్తం ''మా కళను మాకు తిరిగి ఇవ్వండి.. జీన్'' అని రాసుకున్నారు. ఆ విధంగా ప్రధాన మంత్రి జీన్ కాస్టెక్స్ కు విజ్ఞప్తి చేశారు. ఇంతకంటే కోల్పోయేది ఏదీ లేదంటూ ఆవేదనతో కూడిన నిరసన తెలిపారు మాసిరో. ఈ ఘటన అక్కడున్న వారందరినీ షాక్ కు గురిచేసింది. వేదికపైనున్న లేడీ హోస్ట్ తోపాటు సభికుల్లోని పురుషులు కూడా అవును అన్నట్టుగా స్పందించడం విశేషం.