చిన్నల్లుడి ఫోటోలు.. బయటకు ఎలా?

Update: 2016-02-20 22:30 GMT
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వివాహం సెట్ అయిన విషయం తెలిసిందే. పెళ్లి విషయాన్ని బాహాటంగా చెప్పకపోయినా.. దాచి పెట్టలేదు చిరు ఫ్యామిలీ. అలాగని రహస్యంగా చేసేయాలని కూడా అనుకోవడం లేదు. కాకపోతే గతంలో ఓసారి జరిగిన వివాదం కారణంగా.. ఇప్పుడు కుటుంబానికే ఈ వేడుకను పరిమితం చేస్తున్నారంతే. పెళ్లిని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నా.. ఇతనే మా చిన్నల్లుడు అంటూ మెగా బ్రదర్స్ ఎవరూ ఓపెన్ గా చెప్పలేదు.

అయినా సరే.. శ్రీజ ఫియాన్సీ కళ్యాణ్ ఫోటోలు బయటకు వచ్చేశాయి. అయితే.. తాము ఎంత దాచిపెట్టినా.. ఇలాంటి లీకులు ఎలా వస్తాయో తెలుసు కాబట్టి చిరు ఫ్యామిలీలో ఎవరూ లీకుల వ్యవహారాన్ని పట్టించుకోవడం లేదు. కానీ అసలీ లీక్స్ ఎక్కడి నుంచి వచ్చాయో మాత్రం ఓ క్లూ అందింది. తన ఫ్రెండ్స్ తో ఫియాన్సీతో కలిసి దిగిన ఫోటోను.. పంచుకుందట శ్రీజ. వీటిని సెక్యూర్డ్ గానే షేర్ చేసినా.. వారి తిరిగి ఆ ఫోటోలను మరోసారి షేర్ చేయడంతో.. ఈ ఫోటోలు బయటకు వచ్చాయని తెలుస్తోంది.

ఈ విషయం తెలీకుండా.. చిరు ఫ్యామిలీనే సైలెంట్ గా లీకులు ఇచ్చిందంటూ.. కొన్ని సైట్లు అవాకులు, చవాకులు పేలుతున్న విషయాన్ని చిరు ఫ్యాన్స్ అబ్జెక్ట్ చేస్తున్నారు. అయినా అసలు విషయం తెలుసుకుని చెప్పే ప్రయత్నం చేయకుండా.. ఏది పడితే అది రాసేయడం.. కరెక్ట్ కాదనే వాదన వినిపిస్తోంది.
Tags:    

Similar News