మళ్ళీ ఇంకో శుక్రవారం వచ్చేస్తోంది. సినిమా ప్రియులు ఏది చూడాలా అనే ప్లానింగ్ లో అంచనాలను విశ్లేషించుకోవడంలో బిజీగా ఉన్నారు. మహర్షి తర్వాత గట్టిగా చెప్పుకునే స్థాయిలో ఏ మూవీ రాలేదన్నది నిజం. వచ్చిన మీడియం రేంజ్ చిత్రాలన్నీ పబ్లిసిటీ హడావిడి తప్ప అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నది ఏదీ లేకపోవడం ట్రేడ్ ని నిరాశ పరుస్తోంది. ఈ నేపధ్యంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు తెలుగు స్ట్రెయిట్ మూవీస్ రావడం అంటే మాటలా. అయినా కూడా ఎగ్జైట్ అవ్వడానికి లేదు.
ముందుగా చెప్పుకోవాల్సింది మల్లేశం గురించి. సురేష్ సంస్థ అందండలతో రాజ్ దర్శకత్వంలో చేనేత కార్మికుడి బయోపిక్ గా రూపొందిన మల్లేశంకు గత వారం రోజులుగా వరస ప్రీమియర్లు వేశారు. ఇప్పటికైతే టాక్ పాజిటివ్ గానే ఉంది. ఇక స్వరూప్ డైరెక్ట్ చేసిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ డిఫరెంట్ కామిక్ థ్రిల్లర్ గా ఆసక్తి రేపుతోంది. టాక్ వస్తేనే నిలబడే సినిమాలు ఇవి
ఇక మంచు విష్ణు ఓటర్ కూడా ఇదే రేస్ లో ఉంది. నెలల క్రితమే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ ఇప్పటికి ముహూర్తం ఫిక్స్ చేసుకుంది. బజ్ పెద్దగా లేదు కాని వర్తమాన రాజకీయాల మీద సెటైర్ తరహాలో రూపొందినట్టు ట్రైలర్ లో చూపించారు కాబట్టి అదే జనాన్ని రప్పిస్తుందనే నమ్మకంతో ఉన్నారు నిర్మాతలు. ఫస్ట్ ర్యాంక్ రాజు మీద ప్రమోషన్ పుణ్యమా అని అంతో ఇంతో బజ్ అయితే వస్తోంది. ఇవి కాకుండా స్పెషల్-స్టువర్ట్పురం అనే మరో రెండు సినిమాలు 21నే దాడి చేయబోతున్నాయి. ఇన్నేసి బడ్జెట్ సినిమాల్లో ప్రేక్షకులు దేని వైపు లుక్ వేస్తారో దేనికి విజేతగా నిలిచే ఛాన్స్ ఉందో ఇంకో మూడు రోజులు ఆగితే కాని చెప్పలేం