సూపర్ స్టార్ మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో సంక్రాంతి రేస్ లో నువ్వా నేనా? అంటూ పోటీపడుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాల మధ్య ఠఫ్ ఫైట్ ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రీరిలీజ్ బిజినెస్ లో.. అలాగే బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా సత్తా ఎంత? అన్న చర్చ అప్పుడే వేడెక్కించేస్తోంది.
ఈ రెండు చిత్రాలు 100కోట్లు పైగా ప్రీరిలీజ్ బిజినెస్ పూర్తి చేసుకోనున్నాయి. అంతే క్రేజీగా అత్యంత భారీగా థియేటర్లలో రిలీజ్ లకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే థియేటర్ల సెలక్షన్ పూర్తవుతోంది. ఇటు తెలుగు రాష్ట్రాలు సహా అటు ఓవర్సీస్ లోనూ థియేటర్లను లాక్ చేసే పనిలో ఇరు చిత్ర బృందాలు బిజీబిజీగా ఉన్నాయట.
జనవరి 11న సరిలేరు నీకెవ్వరు.. జనవరి 12న అల వైకుంఠపురములో రిలీజ్ ఫిక్సయిపోయింది. ఇక మహేష్ సినిమా ఒకరోజు ముందే రావడం ఆ టీమ్ కి ప్లస్ అవుతుందన్న అంచనాలు ఏర్పడ్డాయి. అసలు టాక్ తో సంబంధం లేకుండానే ఇటు తెలుగు రాష్ట్రాలు.. అటు ఓవర్సీస్ లో ప్రీమియర్ల రూపంలో.. డే వన్ కలెక్షన్ల రూపంలో భారీ మొత్తాన్ని ఆర్జించే వీలుందని అంచనా వేస్తున్నారు. ఓవర్సీస్ మార్కెట్లో సూపర్ స్టార్ మహేష్ కి ఉన్న క్రేజు అలాంటిది. ఇప్పటికే టాప్ 10లో మహేష్ నటించిన పలు సినిమాలకు చోటు దక్కింది. ఇప్పుడు అదే కేటగిరీలో సరిలేరు చిత్రాన్ని చేర్చే దిశగా అనీల్ రావిపూడి- అనీల్ సుంకర- దిల్ రాజు బృందం అద్భుతమైన ఫ్యామిలీ కంటెంట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారని వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలు సహా ఓవర్సీస్ లో భారీ మొత్తంలో థియేటర్లలో సరిలేరు ప్రీమియర్లకు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అలాగే ఓవర్సీస్ లోనూ 21 డాలర్ల వరకూ టిక్కెట్టు ధరను నిర్ణయించడంతో తొలి రోజు అమెరికాలో రికార్డుల్ని నమోదు చేసే వీలుందని అంచనా వేస్తున్నారు.
మరోవైపు అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీపైనా ఈసారి తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఓవర్సీస్ లోనూ భారీ అంచనాలున్నాయి. అల వైకుంఠపురములో పాటలు చార్ట్ బస్టర్ కావడం ఈ సినిమాకి ఓవర్సీస్ లో ఊపు పెంచింది. బన్ని- అరవింద్ - హారిక టీమ్ లు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రైమ్ థియేటర్లు సహా అటు ఓవర్సీస్ లోనూ భారీగా థియేటర్లను ఎంపిక చేసుకుంటున్నారట. మహేష్ సరిలేరు నీకెవర్వరు రిలీజైన మరుసటి రోజే ఈ సినిమా రిలీజవుతుండడంతో థియేటర్ల పరంగా పోటీ అంతే ఇదిగా ఉందట. ఇక మొదటి రోజు టాక్ ని బట్టి సరిలేరు కానీ.. అల చిత్రం కానీ లాంగ్ రన్ కి సిద్ధం కావాల్సి ఉంటుంది. డివైడ్ టాక్ వస్తుందా.. హిట్టు టాక్ వస్తుందా? అన్నది డిసైడ్ చేస్తుంది. ఇక సరిలేరు నీకెవ్వరు థియేటర్లను ఖాళీ చేయించి ఆ మరుసటి రోజు అల వైకుంఠపురములో సినిమాని కొన్ని థియేటర్లలో వేస్తారు కాబట్టి .. బన్ని ముందు బిగ్ ఛాలెంజెస్ ఉంటాయి. యునానిమస్ గా హిట్ టాక్ తెచ్చుకుంటేనే ఎవరికైనా బ్లాక్ బస్టర్ దిశగా పయనించే వీలుంటుంది.