5గురిలో సైమా కిరీటం ఎవరికో

Update: 2019-07-24 07:30 GMT
ఒకప్పుడు టాలీవుడ్ లో సినిమాల ప్రామాణికతను నిర్దేశిచడానికి నంది అవార్డులను మించింది ఇంకొకటి లేదు. అది అందుకుంటే చాలు కెరీర్ లో ఓ గొప్ప ఘనతను సాధించినట్టుగా ఫీలయ్యే వాళ్ళు. హీరో దర్శకుడు మొదలుకుని టెక్నీషియన్ల దాకా అందరి టార్గెట్ అదే ఉండేది. కానీ గత కొన్నేళ్లుగా ఎప్పుడైతే ప్రభుత్వాలు వీటిని ఇవ్వడం మానేసి కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయో అప్పటి నుంచి ఫిలిం ఫేర్ లాంటి ప్రైవేట్ ఈవెంట్స్ కి విపరీతమైన ఆదరణ పెరగడం మొదలైంది.  దాన్ని దాటేసి పేరు తెచ్చుకున్న అవార్డ్స్ ఏవైనా ఉన్నాయా అంటే అది సైమానే.

త్వరలో జరగబోయే సైమా 2019 కోసం ప్రస్తుతం నామినేషన్ల పర్వం సాగుతోంది. ముఖ్యంగా డెబ్యూ డైరెక్టర్ గా బెస్ట్ అవార్డు ఎవరిని వరిస్తుందా అనే ఆసక్తి టాలీవుడ్ లో విపరీతంగ ఉంది. దానికి కారణం పాండవ దర్శకులు అంటే ఐదుగురు. గత ఏడాది సక్సెస్ తో పాటు పేరు తెచ్చుకున్న డెబ్యూ డైరెక్టర్లు ఐదుగురు ఉన్నారు. ఛలోతో ఎంటర్ టైన్మెంట్ ని లవ్ ని బాలన్స్ చేసిన వెంకీ కుడుములు బడ్జెట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ కొట్టాడు.  వరుణ్ తేజ్ తొలిప్రేమతో ఎమోషన్స్ ని తెరమీద అందంగా చూపించిన వెంకీ అట్లూరి రెండో వ్యక్తి. వ్యక్తిత్వ వికాసానికి యువత అంతర్మధానికి ముడి పెడుతూ నీది నాది ఒకే కథ తీసిన వేణు ఊడుగులకు క్రిటిక్స్ నుంచి ప్రశంశలు దక్కాయి.

చాలా తక్కువ పాత్రలతో మూడు నాలుగు ఇంటీరియర్ లొకేషన్స్ లో రాహుల్ రవీంద్రన్ రూపొందించిన చిలసౌ సుశాంత్ కి హిట్ తో పాటు ఇతనికి నాగార్జున నుంచి ఆఫర్ వచ్చేలా చేసింది. ఇక ప్రేమలోకి మరో కోణాన్ని వెలికి తీసి బాక్స్ ఆఫీస్ కి షాక్ ఇచ్చిన ఆరెక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి చాలా కాలం టాక్ అఫ్ ది టౌన్ గా ఉన్నాడు. మరి ఈ ఐదుగురిలో ఇంత తీవ్రమైన పోటీ మధ్య సైమా 2019 డెబ్యూ డైరెక్టర్ గా ఎవరు కిరీటాన్ని అందుకుంటారనేది ఆసక్తికరంగా మారింది


Tags:    

Similar News