#RRR: విలన్‌ ఉన్నట్టా? లేనట్టా?

Update: 2019-03-15 08:43 GMT
రాజమౌళి ప్రతి సినిమాలో కూడా విలన్‌ కు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. విలన్‌ చాలా పవర్‌ ఫుల్‌ గా ఉంటేనే హీరోను మరింత పవర్‌ ఫుల్‌ గా చూపించే అవకాశం ఉంటుందనేది రాజమౌళి అభిప్రాయం. అందుకే ఆయన గత చిత్రాలన్నింటిలో కూడా విలన్‌ కు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చాడు. ఈగ - బాహుబలి చిత్రాల్లో విలన్‌ ను ఏ స్థాయిలో జక్కన్న చూపించాడో మర్చిపోలేం. అటువంటిది ఇప్పుడు ఆయన దర్శకత్వంలో వస్తున్న భారీ మల్టీస్టారర్‌ చిత్రం 'ఆర్‌ ఆర్‌ ఆర్‌'లో విలన్‌ పాత్ర ఉందా లేదా అనే విషయమై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ చిత్రం కోసం అజయ్‌ దేవగన్‌ ను ఎంపిక చేసినట్లుగా రాజమౌళి ప్రకటించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన విలన్‌ గానే నటించే అవకాశం ఉందని అంతా భావించారు. కాని నిన్నటి అదే ప్రెస్‌ మీట్‌ లో అజయ్‌ దేవగన్‌ విలన్‌ కాదని రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు. దాంతో అజయ్‌ దేవగన్‌ కాకుండా ఈ చిత్రంలో మరెవ్వరు విలన్‌ గా కనిపిస్తారు అనే విషయం చర్చనీయాంశం అయ్యింది. ఈ చిత్రంలో తమిళ నటుడు సముద్ర ఖని నటిస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

అయితే ఆయన అయినా విలన్‌ గా కనిపించబోతున్నాడా లేదంటే క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానే కనిపిస్తాడా అనేది క్లారిటీ ఇవ్వలేదు. స్వాతంత్య్ర సమరోద్యమం నేపథ్యంలో కనుక సినిమాలో విలన్‌ అంటే బ్రిటీష్‌ వారే అయ్యి ఉంటారు అని కొందరు అభిప్రాయ పడుతున్నారు. మొత్తానికి ఈ చిత్రంలో జక్కన్న గత చిత్రాల మాదిరిగా పవర్‌ ఫుల్‌ విలన్‌ ఉంటాడా - లేదా అనే విషయంలో కన్ఫ్యూజన్‌ నెలకొంది. ఈ కన్ఫ్యూజన్‌ ను సినిమా విడుదల అయ్యే వరకు జక్కన్న కంటిన్యూ చేస్తాడా లేదంటే విలన్‌ విషయంలో జక్కన్న ముందే క్లారిటీ ఇస్తాడా చూడాలి.
Tags:    

Similar News