ఫిబ్రవరిలో ప్రకటన సంగతి మర్చిపోయిన అఖిల్!

Update: 2019-03-07 15:30 GMT
నాగార్జున రెండో కుమారుడు అఖిల్ కెరీర్ ఆశించినట్టుగా ముందు సాగడం లేదు.  నాగచైతన్య కంటే జోరుగా కెరీర్లో దూసుకుపోతాడు.. ఈ జెనరేషన్ లో అక్కినేని అభిమానులను అఖిల్ మురిపిస్తాడనుకుంటే మొదటి హిట్ కోసమే ఏళ్ళతరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. మొదటి సినిమా విషయంలో పోరపాటు జరిగిందనే ఉద్దేశంతో రీ-లాంచ్ చేసి మరీ 'హలో' విషయంలో జాగ్రత్త తీసుకున్నా వర్కవుట్ కాలేదు.  మూడో సినిమా 'Mr. మజ్ను' అయినా హిట్ ఇస్తుందని ఆశిస్తే అది కూడా నిరాశపరిచింది.

దీంతో అఖిల్ పూర్తిగా కన్ఫ్యూజన్లో పడ్డట్టుగా ఉన్నాడు. తన నెక్స్ట్ సినిమా ప్రకటన డిలే కావడమే అందుకు రుజువు.  'Mr. మజ్ను' సినిమా ప్రమోషన్స్ సమయంలో ఫిబ్రవరిలోనే తన నెక్స్ట్ సినిమా అధికారిక ప్రకటన ఉంటుందని.. ఎక్కువ టైమ్ తీసుకోకుండా సెట్స్ పైకి వెళ్తామని చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు చూస్తే ఫిబ్రవరి పూర్తవడమే కాదు... మార్చి మొదటి వారం కూడా పూర్తయింది. కానీ అఖిల్ కొత్త సినిమా ప్రకటన ఊసే వినపడడం లేదు. అఖిల్ కూడా సైలెంట్ గా ఉంటున్నాడు.

మొదట్లో శ్రీను వైట్ల లాంటి కొంతమంది దర్శకుల పేర్లు వినిపించినా.. రీసెంట్ గా మాత్రం అఖిల్ కెరీర్ ను చక్కదిద్దే బాధ్యతను నాగార్జున అల్లు అరవింద్ కు అప్పగించారని వార్తలు వస్తున్నాయి.  అఖిల్ కోసం 'బొమ్మరిల్లు' భాస్కర్ సినిమాను సెట్ చేస్తున్నారని కూడా టాక్ వినిపిస్తోంది.  ఇదంతా చూస్తుంటే అఖిల్ సినిమా అధికారిక ప్రకటన వచ్చేందుకు మాత్రం ఇంకా సమయం పట్టేలా ఉంది.
    

Tags:    

Similar News