ముగ్గురు అక్కినేని హీరోల్ని ఒకే ఫ్రేమ్ లో చూపించేందుకు కళ్యాణ్ కృష్ణ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మనం తర్వాత మళ్లీ అలాంటి రేర్ ఫీట్ రిపీట్ చేయాలన్న ఆలోచన ఉంది. అందుకే నాగార్జున- నాగచైతన్య- అఖిల్ లను కలుపుతూ బంగార్రాజు స్క్రిప్టును మలిచారు కళ్యాణ్. మనం మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ని మరోసారి సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు. బంగార్రాజు ఇటీవలే హైదరాబాద్ లో ప్రారంభమైంది. త్వరలోనే రెగ్యులర్ చిత్రీకరణకు వెళ్లనున్నారు.
ఇది `సోగ్గాడే చిన్ని నాయన` చిత్రానికి ప్రీక్వెల్ కథతో తెరకెక్కనుంది. అంటే బంగార్రాజు చనిపోక ముందు యువకుడిగా ఉన్నప్పటి కథను తెరపై ఆవిష్కరించనున్నారు. ఇందులో నాగార్జున సరసన రమ్యకృష్ణ ఒక నాయిక. పలువురు కథానాయికలు నటిస్తున్నారు. అలాగే నాగచైతన్య సరసన కృతి శెట్టి కథానాయిక. అతి త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
తాజా సమాచారం మేరకు.. ఈ చిత్రంలో అఖిల్ పాత్రను కొంతవరకూ మార్చాల్సి వచ్చిందని తెలిసింది. అఖిల్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నందున ఈ సినిమాలో భాగం కాలేని పరిస్థితి నెలకొంది. దీంతో కథ కొద్దిగా మార్చారని తెలిసింది. సాధ్యమైనంత వరకూ కింగ్ నాగార్జున ఆ పాత్రలోనూ నటించాలని భావించారు. కానీ కనెక్టివిటీ కుదరలేదని దీంతో అఖిల్ పాత్రను తొలగించే ఛాన్సుందని కూడా టాక్ వినిపిస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. మూవీలో తారాగణం సిబ్బందికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తారు.