మొదటి నుండి కూడా తమిళ హీరోల సినిమాలు తెలుగులో మంచి ఆధరణ పొందుతూ వస్తున్నాయి. రజినీకాంత్.. కమల్ హాసన్ వంటి స్టార్స్ సినిమాలను డైరెక్ట్ సినిమాల మాదిరిగానే తెలుగు ఆడియన్స్ ఆధరిస్తూ ఉంటారు. వారి తర్వాత సూర్య.. కార్తీ ఇకొందరు కూడా తెలుగు సినిమా స్క్రీన్ పై మెప్పించే ప్రయత్నం చేశారు. తమిళ హీరోలు తెలుగు తెరపై వరుసగా హిట్స్ అవ్వడం ఒకప్పటి విషయం. కాని ప్రస్తుతం పరిస్థితి మారింది. తమిళ డబ్బింగ్ సినిమాలు తెలుగులో చాలా రేర్ గా సక్సెస్ అవుతున్నాయి. ఈమద్య కాలంలో తమిళ సినిమా ఏది కూడా తెలుగులో హిట్ అయిన దాఖలాలు కనిపించడం లేదు.
తమిళ సినిమాల పట్ల తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిందనిపిస్తుంది. కాని బయ్యర్లు మరియు నిర్మాతలు మాత్రం తమిళ సినిమాలపై అంతే మోజు పడుతున్నారు. తమిళ స్టార్ హీరోల సినిమాలను తెలుగు నిర్మాతలు భారీ మొత్తాలకు కొనుగోలు చేస్తూ చేతులు కాల్చుకుంటున్నారు. త్వరలో తమిళం నుండి రెండు సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వాటిలో ముఖ్యమైనది 'విజిల్'. విజయ్ హీరోగా నటించిన బిగిల్ తెలుగు వర్షన్ విజిల్. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 675 థియేటర్లలో విడుదల కాబోతుందట. కేవలం నైజాం ఏరియాలో 275 థియేటర్లలో విడుదల చేసేందుకు బయ్యర్లు సిద్దం చేశారు.
తెలుగులో ఇప్పటి వరకు విజయ్ కమర్షియల్ గా భారీ విజయాన్ని ఒక్కసారి కూడా సొంతం చేసుకోలేక పోయాడు. మొన్నటి వరకు విజయ్ ని కొందరు తెలుగు ప్రేక్షకులు గుర్తు పట్టేవారు కాదు. కాని సర్కార్ చిత్రం మరియు అంతకు ముందు వచ్చిన ఒకటి రెండు సినిమాలతో గుర్తింపు అయితే దక్కించుకున్నాడు కాని కోట్ల వర్షం కురిపించే స్థాయిలో మాత్రం టాలీవుడ్ లో స్టార్ డం ఈయన పొందలేదు. అయినా కూడా విజిల్ సినిమాను బయ్యర్లు భారీ మొత్తానికి కొనుగోలు చేశారట. అందుకే ఈ చిత్రంను ఏకంగా 675 థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. విజయ్ 'విజిల్' సినిమాకు పెద్దగా ప్రమోషన్ చేసింది లేదు.. విజయ్ కి ఒక్క కమర్షియల్ హిట్ లేదు అయినా కూడా అన్ని థియేటర్లలో భారీగా విడుదల చేయడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. బయ్యర్లకు విజయ్ పై ఉన్న మోజుతో ఆ స్థాయి థియేటర్లలో విడుదల చేస్తున్నట్లుగా అనిపిస్తుంది.
ఇక మరో తమిళ తంబీ కార్తీ. ఈయన తెలుగులో పర్వాలేదు అన్నట్లుగా సక్సెస్ లు దక్కించుకున్నాడు. అయితే ఈయనకు తెలుగులో సక్సెస్ వచ్చి చాలా కాలం అయ్యింది. అయినా కూడా అన్ని సినిమాలను తెలుగు ప్రేక్షకుల మీదకు వదులుతున్నాడు. ఈయన చేస్తున్న ప్రతి సినిమా తెలుగులో లాస్ వెంచర్ అనిపించుకుంటుంది. అయినా కూడా బయ్యర్లు కార్తీ తాజా చిత్రం 'ఖైదీ'ని భారీ ఎత్తున విడుదల చేసేందుకు సిద్దం అయ్యారు. కార్తీ నటించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో బజ్ లేదు. సినిమా పోస్టర్స్.. టీజర్ ఇలా ఏది కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించలేక పోయింది.
తెలుగు సినిమాలకు ఇలా బజ్ లేకుండా విడుదలైతే బయ్యర్లు అసలు పట్టించుకోరు. సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు నానా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. థియేటర్లు దొరకవు.. కాని ఈ తమిళ తంబీల సినిమాలపై ఏమాత్రం అంచనా లేకున్నా కూడా ఇంతగా బయ్యర్లు థియేటర్లను ఇస్తున్నారు. ఈ తమిళ హీరోలు అంటే మన తెలుగు నిర్మాతలు మరియు బయ్యర్లకు ఎందుకు ఇంత మోజో వారికే తెలియాలి.