పవన్ బర్త్ డేకి బన్నీ విష్ చేయలేదేంటి..?

Update: 2022-09-03 11:30 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో నిన్న శుక్రవారం సోషల్ మీడియా టైం లైన్స్ శుభాకాంక్షలతో నిండిపోయాయి. సినీ రాజకీయ ప్రముఖులు శ్రేయోభిలాషులు మరియు అభిమానులు జనసేన అధినేత కు స్పెషల్ గా బర్త్ డే విషెస్ అందజేసారు. అందులో సోదరుడు మెగాస్టార్ చిరంజీవి మరియు బాక్సాఫీస్ ప్రత్యర్థి సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి చాలా మంది అగ్ర తారలు ఉన్నారు. అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ విష్ చేయకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మెగా ఫ్యామిలీలో ఎవరి పుట్టినరోజు ఉన్నా మిగతా కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేస్తారు. అయితే ఇటీవల కాలంలో మెగా ఫ్యామిలీకి - అల్లు కుటుంబానికి మధ్య దూరం పెరిగిందని రూమర్స్ వస్తున్న నేపథ్యంలో.. పవన్ కళ్యాణ్ కు బన్నీ విష్ చేస్తాడా లేదా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూసారు. అయితే అల్లు అర్జున్ పవన్ కోసం సోషల్ మీడియాలో ఎలాంటి విషెస్ పోస్ట్ చేయలేదు.

మెగా హీరోలకు అల్లు అర్జున్ మధ్య కాస్త గ్యాప్ వచ్చినట్లు ఈమధ్య ఎక్కువగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తొలినాళ్లలో మెగా బ్రాండ్ తోనే సినిమాలు చేసిన బన్నీ.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి తీవ్రంగా కష్టపడ్డాడని.. ఇప్పుడు 'అల్లు' బ్రాండ్ ను నిర్మించడంపై పూర్తిగా దృష్టి సారించాడని టాక్ వచ్చింది. మెగా అభిమానులు కూడా రెండు వర్గాలుగా చీలిపోయి తరచుగా సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ చేసుకోవడం మనం చూస్తున్నాం.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో కనీసం ఒక పోస్ట్ కూడా చేయకపోవడం.. మెగా - అల్లు మధ్య విభేదాలను స్పష్టం చేస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో బన్నీ సన్నిహితంగా లేడు కాబట్టి.. అతనికి విషెస్ చెప్పలేదని వ్యాఖ్యానిస్తున్నారు.

దీనిపై అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టకపోయినా అల్లు అర్జున్ వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలిపి ఉండవచ్చు కదా అని అంటున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడని.. అందుకే అతనికి ట్వీట్ పెట్టే సమయం లేదని కొందరు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

అయితే అల్లు అర్జున్ శుక్రవారం రాత్రి హైదరాబాద్ లోని ఒక పబ్ లో గీతా ఆర్ట్స్ కోసం పనిచేసే తన ఫ్రెండ్స్ గ్యాంగ్ తో కలిసి పార్టీ చేసుకున్నారని వార్తలు వచ్చాయి. దీన్ని బట్టి బన్నీ ఇక్కడే ఉన్నా పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు చెప్పడానికి ఆసక్తి కనబరచలేదని మరికొందరు అంటున్నారు.

ఇటీవల చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా గోవాలో జరిగిన వేడుకల్లో మెగా ఫ్యామిలీతో పాటుగా అల్లు బాబీ - అల్లు అరవింద్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఇందులో అల్లు అర్జున్ లేకపోవడంపై సర్వత్రా చర్చ జరిగింది. అయితే ఆ సమయంలో బన్నీ న్యూయార్క్ లో జరిగిన ఇండియా డే పరేడ్ లో పాల్గొనడంతో ఈ సెలబ్రేషన్స్ కు దూరమయ్యాడు. అయినప్పటికీ ఐకాన్ స్టార్ ట్విట్టర్ వేదికగా చిరు కు బర్త్ డే విషెస్ అందజేశారు.

కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజును అల్లు అర్జున్ విస్మరించారని పలువురు మెగా అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. నిజానికి బన్నీ గత ఎన్నికలప్పుడు గోదావరి జిల్లాలో జరిగిన జనసేన బహిరంగ సభకు హాజరై పవన్ కు తన శుభాకాంక్షలు తెలియజేసారు. అలానే గతేడాది పవర్ స్టార్ బర్త్ డేకి విషెస్ అందజేశారు. కానీ ఈసారి పుట్టినరోజును పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.

అయినా పుట్టినరోజుకు విషెస్ చెప్పడం చెప్పకపోవడం వారి వ్యక్తిగత విషయం. ట్వీట్ చేయకపోయినంత మాత్రాన పవన్ కళ్యాణ్ మరియు అల్లు అర్జున్ మధ్య విభేదాలు వచ్చాయనే విధంగా నివేదించడం సరైనది కాదు. బిజీగా ఉండటం వల్ల సోషల్ మీడియాలో విష్ చేయకపోవచ్చు. లేదా నేరుగా ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పి ఉండొచ్చు. అభిమానులు ఎప్పుడూ ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని మెలిగితే మంచిది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News