ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌ల‌కు డి.సురేష్ బాబు దూరం దేనికి?

Update: 2021-10-01 02:30 GMT
సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత‌..పంపిణీదారుడు.. ఎగ్జిబిట‌ర్.. నిర్మాత.. రామానాయుడు స్టూడియోస్ అధినేత‌ ద‌గ్గుబాటి సురేష్ బాబు సినిమాటోగ్ర‌పీ మంత్రి పేర్ని నానితో జ‌రిగిన గ‌త రెండు స‌మావేశాలకు హాజ‌రు కాని సంగ‌తి  తెలిసిందే. ప‌రిశ్ర‌మ త‌రుపున దిల్ రాజు..బ‌న్నీవాసు..సునీల్ నారంగ్..మైత్రీ మూవీ మేక‌ర్స్ అధినేత‌లు మిన‌హా అగ్ర నిర్మాత సురేష్ బాబు మాత్రం ఈ భేటికి హాజ‌రు కాలేదు. తొలిసారి జ‌రిగిన స‌మావేశానికి హాజ‌ర‌య్యారు గానీ..అటుపై జ‌రిగిన రెండు స‌మావేశాల్లో సురేష్ బాబు క‌నిపించ‌లేదు. త‌ర్వాత ఆ స‌మావేశాల‌పై ఆయ‌న స్పందించింది కూడా లేదు. సాధార‌ణంగా  తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ త‌రుపున‌..అదీ నిర్మాత‌ల ప‌క్షాన ముందుండి నిల‌బ‌డి మాట్లాడేది ఎప్పుడూ ఆయ‌నే .

కానీ గ‌త రెండు స‌మావేశాల‌కు మాత్రం హాజ‌రు కాక‌పోవ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అస‌లు సురేష్ బాబు ఎంద‌కు మౌనంగా ఉన్నారు? అన్న‌ది ప‌రిశ్ర‌మ‌లో హాట్ టాపిక్ గా మారింది.  ఈనేప‌థ్యంలో కొన్ని ఆస‌క్తిక‌ర సంగ‌తులు లీక్ అవుతున్నా యి. ఏపీ  సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నేరుగా అపాయింట్ మెంట్ ఇవ్వ‌కుండా.. మ‌ధ్య‌లో మంత్రుల‌తో సంప్ర‌దింపులు జ‌ర‌ప‌డం ఆయ‌న‌కు న‌చ్చ‌లేద‌ని ఆ కారణంగానే సురేష్ బాబు దూరంగా ఉన్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. మంత్రి తో ఎన్ని స‌మావేశాలు జ‌రిగినా అవి ఓ కొలిక్కి రావ‌ని..దీనివ‌ల్ల స‌మ‌యం వృథా త‌ప్ప ఓరిగేది ఏదీ ఉండ‌ద‌ని ఆయ‌న దూరంగా ఉన్న‌ట్లు టాక్ వినిపిస్తోంది.

మ‌రోవైపు ఇంకో బ‌ల‌మైన కార‌ణం కూడా వినిపిస్తోంది. ఇప్పుడీ వ్య‌వ‌హారంలోకి సురేష్ బాబు దూరితే అత‌నికే తీవ్ర న‌ష్ట‌మ‌ని మ‌రికొన్ని వాద‌న‌లు తెర‌పైకి వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే గీతం యూనిర్శీటీ అక్ర‌మ క‌ట్ట‌డాల‌పై జ‌గ‌న్ స‌ర్కార్ ఉక్కుపాదం మోపిన సంగ‌తి తెలిసిందే. అడ్డ‌గోలు క‌ట్ట‌డాల్ని ప్ర‌భుత్వం కూల్చివేసింది. ఈ నేప‌థ్యంలో రామానాయ‌డు స్టూడియోస్ పైనా ఎటాక్ జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని.. ఆ కార‌ణంగాను సురేష్ బాబు మౌనంగా ఉన్నార‌ని కొంత‌మంది భావిస్తున్నారు. కార‌ణాలు ఏవైనా ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌స్తుతం చోటు చేసుకున్న స‌మ‌స్య‌ల‌పై స్పందించాల్సిన బాధ్య‌త ఓ అగ్ర నిర్మాత‌గా సురేష్ బాబుపై ఉందని మెజార్టీ వ‌ర్గం అభిప్రాయ‌ప‌డుతోంది.
Tags:    

Similar News