తెలుగు మార్కెట్‌ పై మరీ ఇంత నమ్మకం ఏంటి ధనుష్‌?

Update: 2022-09-21 07:15 GMT
తమిళ స్టార్‌ హీరో ధనుష్ నేనే వస్తున్న సినిమా తో వచ్చే వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. తమిళంతో పాటు తెలుగు లో భారీ ఎత్తున ఈ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయి. తెలుగు లో ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పించేందుకు సిద్ధం అవ్వడంతో సినిమా స్థాయి మరింతగా పెరిగిందంటూ మీడియాలో చర్చ జరుగుతోంది.

తమిళంలో రూపొందిన భారీ బడ్జెట్‌ మణిరత్నం డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ పొన్నియన్ సెల్వన్‌ ను వచ్చే వారంలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఒక్క రోజు తేడాతో ఈ రెండు సినిమాలు రాబోతున్నాయి. పొన్నియన్‌ సెల్వన్ వంటి భారీ సినిమాకు పోటీగా ధనుష్ సినిమాను విడుదల చేయడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

పొన్నియన్‌ సెల్వన్‌ సినిమా పై గౌరవంతో అయినా ధనుష్ సినిమా వాయిదా వేసుకుంటాడని నిన్న మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. మణిరత్నం సినిమా అయినా మరెవ్వరి సినిమా అయినా కూడా తనకు పట్టదు అన్నట్లుగా ధనుష్ తన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాడు.

మణిరత్నం సినిమా పొన్నియన్ సెల్వన్ కారణంగా కచ్చితంగా ధనుష్ సినిమా నేనే వస్తున్న కు తమిళనాట కాస్త తక్కువగానే వసూళ్లు ఉండే అవకాశం ఉంది. కానీ ధనుష్ ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లోని బిజినెస్ పై ఆసక్తిగా ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి.

తెలుగు లో పెద్ద సినిమాలు ఏమీ విడుదల కావడం లేదు.. కనుక ఈ సినిమా కచ్చితంగా తెలుగు లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందని ధనుష్‌ భావిస్తున్నాడట.

తెలుగు లో ఇప్పటి వరకు ధనుష్ నటించిన సినిమాలు ఒకటి రెండు కాస్త పర్వాలేదు అన్నట్లుగా కమర్షియల్‌ హిట్‌ గా నిలిచాయి. అయినా కూడా ఈ సినిమాపై నమ్మకంతో.. తెలుగు మార్కెట్‌ పై నమ్మకంతో పొన్నియన్ సెల్వన్‌ కు పోటీ అయినా పర్వాలేదు అన్నట్లుగా విడుదలకు సిద్ధం అయ్యాడు. తెలుగు రాష్ట్రాల్ల వారం పది రోజుల సెలవులు రాబోతున్నాయి. కనుక ధనుష్ సినిమా కు ఎలాంటి స్పందన ఉంటుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News