ఏళ్ల నుంచి ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. తెలుగోళ్ల ఆరాధ్య దైవం.. ప్రత్యర్థులు సైతం పొగిడే తత్త్వం ఉన్న స్వర్గీయ నందమూరి తారకరామారావు బయోపిక్ కథానాయకుడు రిలీజ్ అయ్యింది. నందమూరి ఫ్యామిలీతో పాటు.. నారా ఫ్యామిలీ సైతం ఈ మూవీ గురించి తెగ మాట్లాడేస్తున్నారు.
అదిరిపోయింది.. అద్భుతంగా ఉంది.. సూపర్ అంటూ పొగిడేస్తున్నారు. ఇంత సందడిలోనూ ఒక నిశ్శబ్దం అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. నోరు తెరిచింది మొదలు.. తన సినిమాల్లో ఒక్కసారైనా ఆ తాతకు మనమడ్ని అంటూ చెప్పుకునే జూనియర్ ఎన్టీఆర్ అలియాస్ తారక్.. ఈ మూవీ ఎలా ఉందన్న దానిపై ఇప్పటివరకూ స్పందించలేదు.
ఆ మాటకు వస్తే సినిమా చూసినట్లుగా కూడా లేదంటున్నారు. బాబాయ్ బాలయ్యతో రిలేషన్ పెద్దగా లేదన్న మాటలు వినిపిస్తున్న వేళ.. కథానాయకుడు సినిమా మీద తారక్ ఇంత వరకూ రియాక్ట్ కాకపోవటం ఒక ఎత్తు అయితే.. ఈ సినిమాకు తనకూ ఏ మాత్రంసంబంధం లేదన్నట్లుగా ఆయన తీరు ఉందంటున్నారు.
బాబాయ్ తో పంచాయితీ ఉంటే ఉండొచ్చు. దాన్ని పక్కన పెడితే.. తన సోదరుడు కల్యాణ్ రామ్ తన తండ్రి పాత్రను పోషించిన నేపథ్యంలో.. ఈ మూవీ గురించి తారక్ మాట్లాడతారని భావించినోళ్లకు నిరాశే మిగిలింది. ఇదిలా ఉంటే.. తారక్ ట్విట్టర్ పేజీలో ఈ మూవీకి సంబంధించిన చాలా పాత అప్డేట్ ఉంచారు. డిసెంబరు 21న ఎన్టీఆర్ అధికారిక టీజర్ ను పోస్ట్ చేశారు. ఆ తర్వాత కొత్త సంవత్సర శుభాకాంక్షలు మినహా మరే పోస్టు లేదు.
సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో తాత మీద ఉన్న అభిమానాన్ని.. తన వాల్ పేజీ పిక్ ను మారుస్తారని భావించిన వారికి షాకిస్తూ.. అలాంటిదేమీ చేయకుండా.. ఆ మధ్యన రిలీజ్ అయిన అరవింద సమేత మూవీ పోస్టర్ ను ఉంచేయటం గమనార్హం. ఇదంతా చూస్తే.. కథానాయకుడి మూవీతో తనకేం సంబంధం లేదన్నట్లుగా తారక్ తీరు ఉందన్నట్లుగా ఉంది. బాబాయ్ సినిమాకు అబ్బాయ్ రియాక్ట్ కాకపోవటం తర్వాత.. కనీసం అన్న కోసమైనా కథానాయకుడి మూవీ గురించి పట్టించుకోకపోవటం ఏమిటి? ఎందుకిలా తారక్?
Full View