టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్నారు. చాలా వరకు ప్రతీ దర్శకుడి చేతిలోనూ ఓ సినిమా వుంది. స్టార్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా వున్నారు. ఇదిలా వుంటే స్టార్ డైరెక్టర్ కొరటాల శివ స్టార్స్ తో సినిమాల పరంగా తనకు ఎలాంటి హరీ బరీ లేదంటున్నారు. తనకు ఏ మాత్రం తొందర లేదంటూ చాలా కూల్ గా చెబుతుండటం విశేషం. ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో 'ఆచార్య' చిత్రాన్ని తెరకెక్కించారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం ఎట్టకేలకు ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. దాదాపు రెండేళ్లుగా చిరు సినిమా థియేటర్లలో సందడి చేయకపోవడంతో ప్రేక్షకులు, అభిమానలు అంతా ఆయన సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలో సందడి చేస్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అత్యంత భారీ స్థాయిలో మెగా ఫ్యాన్స్ కి ఏప్రిల్ 29న 'ఆచార్య' థియేటర్లలో సందడికి రెడీ అవుతూ పండగ వాతావరణాన్ని తీసుకురాబోతోంది.
మెగా ఫ్యాన్స్ కి డబుల్ బొనాంజా అన్నట్టుగా ఒకే చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించారు. ఈ ఇద్దరిని వెండితెరపై చూడాలని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కల 'ఆచార్య'తో నెరవేరబోతోంది.
దీంతో థియేటర్లలో మెగా ఫ్యాన్స్ మాస్ జాతరతో హల్ చల్ చేయడం ఖాయం అని అంటున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత స్టార్ డైరెక్టర్ కొరటాల శివ యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ సినిమాకు రెడీ అయిపోతున్నారు.
అయితే ఈ సినిమాకు ముందు అల్లు అర్జున్ తో సినిమా చేయాల్సి వుంది. ఈ ప్రాజెక్ట్ ని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు కూడా. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఆ స్థానంలో 'పుష్ప'ని పట్టాలెక్కించారు బన్నీ. దీంతో కొరటాల శివ - బన్నీ ప్రాజెక్ట్ ఇక లేనట్టే అనే వార్తలు వినిపించాయి. ఆ వార్తలని నిజం చేస్తూ కొరటాల శివ వెంటనే ఎన్టీఆర్ సినిమా ని ప్రకటించారు. అయితే తాజాగా 'ఆచార్య' రిలీజ్ ప్రమోషన్ లలో భాగంగా పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్న దర్శకుడు కొరటాల శివ .. బన్నీ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చారు.
ఈ ప్రాజెక్ట్ ని ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పట్టాలెక్కించాలని ప్లాన్ చేశారు కూడా. అయితే ముందు ఎన్టీఆర్ సినిమాని పూర్తి చేసిన తరువాతే బన్నీ సినిమా చేస్తానని తాజాగా కొరటాల శివ వెల్లడించి రూమర్ లకు చెక్ పెట్టారు. బన్నీతో సినిమా ఖచ్చితంగా వుంటుంది. అయితే అది ఎన్టీఆర్ సినిమా తరువాతే అన్నారు. అంతే కాకుండా బన్నీతో సినిమా విషయంలో నేను తొందరపడటం లేదని, అంత తొందర తనకు లేదని స్పష్టం చేశారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం వుందని తెలుస్తోంది.