‘లెజెండ్’కు అందుకిచ్చారు.. ‘మనం’కు అందుకివ్వలేదు

Update: 2017-11-16 07:51 GMT
2014 సంవత్సరానికి ‘మనం’ సినిమాకు కాకుండా ‘లెజెండ్’కు ఉత్తమ చిత్రంగా నంది అవార్డు కట్టబెట్టడం.. పైగా ఆ చిత్రానికి ఏకంగా 9 అవార్డులు ఇవ్వడంపై దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం మీద టీవీ ఛానెళ్లలో జోరుగా చర్చలు కూడా సాగుతున్నాయి. ఒక ఛానెల్లో చర్చకు నంది అవార్డుల కమిటీలో సభ్యులైన ప్రసన్న కుమార్.. ప్రభు కూడా వచ్చారు. వాళ్లిద్దరూ అసలు ‘లెజెండ్’కు ఎందుకు ఉత్తమ సినిమాగా అవార్డిచ్చింది.. ‘మనం’కు ఎందుకు ఇవ్వంది వివరించారు.

‘లెజెండ్’ సినిమాలో మహిళల గొప్పదనాన్ని చాటి చెప్పే సన్నివేశాలు ఉన్నాయట. ఇందులో బ్రూణ హత్యల గురించి మంచి డైలాగుతున్నాయట. దీంతో పాటు సమకాలీన రాజకీయాలపై సామాజిక బాధ్యతతో కీలకమైన విషయాల్ని చర్చించారట. అలాగే ‘లెజెండ్’ 1170 రోజులకు పైగా ప్రదర్శితమైన విషయాన్ని కూడా ఒక అర్హతగా చెప్పారు ప్రసన్న కుమార్. ఇక ‘మనం’ సినిమాకు అవార్డు ఇవ్వకపోవడానికి ఒక ఆసక్తికర కారణం చెప్పారు ప్రసన్న కుమార్. పునర్జన్మలు, ఆత్మల నేపథ్యంలో సాగే కథలకు నంది అవార్డు ఇవ్వరట. ఇలాంటి సినిమాలకు అవార్డులిస్తే మూఢ నమ్మకాల్ని ప్రోత్సహించినట్లవుతుందట. కానీ గతంలో ఎన్నో పునర్జన్మల కథలకు అవార్డులిచ్చారు. అందుకు సరైన ఉదాహరణ ‘ఈగ’. మరి ఆ సినిమాలో ఆత్మలు, పునర్జన్మలపై చర్చ లేదా? మరి దానికి మినహాయింపు ఎలా ఇచ్చారో?
Tags:    

Similar News