ఈమధ్య తెలుగు సినిమాల పరిస్థితి ఆశాజనకంగా లేదు. వరస ఫెయిల్యూర్ లతో థియేటర్లు వెలవెలబోతున్న సమయంలో 'వెంకీమామ' రిలీజై టాలీవుడ్ కు కొంత సందడి తీసుకొచ్చింది. వెంకటేష్ - నాగచైతన్య కాంబినేషన్ లోతెరకెక్కిన ఈ సినిమా కు బాబీ దర్శకత్వం వహించారు. సినిమా రిలీజై మూడో వారంలోకి వస్తున్నప్పటికీ ఇంకా చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రాబడుతూ హిట్ గా నిలిచింది.
ఈ సినిమా విజయం అటు వెంకీకి.. ఇటు చైతుకూ ఫుల్ జోష్ ఇచ్చింది. వెంకీ 'F2' జోరును కొనసాగించగా.. చైతు 'మజిలీ' ఊపును కొనసాగించాడు. డైరెక్టర్ బాబీ కూడా ఈ సినిమా తో మరో హిట్టు నమోదు చేశాడు. అయితే బాబీకి మాత్రం పెద్దగా పేరు రావడం లేదు. ఈ సినిమా నే కాదు.. గతం లో బాబీ దర్శకత్వం వహించిన సినిమాల కు ఎప్పుడూ బాబీ కి పెద్దగా క్రెడిట్ దక్కలేదు. భారీ బడ్జెట్ సినిమాల ను స్టార్ హీరోలను స్మూత్ గా హ్యాండిల్ చెయ్యగలడు అనే పేరు తప్ప బాబీ ఒక మంచి ఫిలిం మేకర్ అనే ప్రశంసలు ఇప్పటి వరకూ దక్కలేదు. బాబీ సరైన కంటెంట్ తో సినిమా తెరకెక్కించగలడు... సాలిడ్ హిట్ ఇవ్వగలడు అనే అభిప్రాయం ఎక్కువమందికి కలగడం లేదు.
బాబీ దర్శకత్వం లో తెరకెక్కిన ఏ సినిమా గురించి అడిగినా ఎక్కువమంది ఆ సినిమాలో లోటుపాట్లు చర్చిస్తారు కానీ ఇది ఈ సినిమాలో హైలైట్.. ఇది బాబీ మార్క్ అని ఒక్కరు కూడా చెప్పడం లేదు. 'వెంకీమామ' కూడా సినిమా లో స్టఫ్ కంటే రిలీజ్ టైమింగ్.. వెంకీ-చైతు కాంబినేషన్ మీద ఉన్న ఆసక్తి కారణం గా హిట్ అయిందని భావించేవారు ఎక్కువ మంది ఉన్నారు. బాబీ ఈ అభిప్రాయాన్ని చెరిపేయాలంటే మంచి కంటెంట్ ఉన్న సినిమా తో హిట్ సాధించి నిరూపించాల్సిందేనని టాక్ వినిపిస్తోంది.