బాక్స‌ర్ `ఘ‌ని`లో ఇంకెన్నాళ్లు ఈ డైల‌మా?

Update: 2021-03-02 12:30 GMT
వారం వారం మూడు నాలుగు సినిమాల‌తో థియేట‌ర్లు క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి. క్రైసిస్ ఇంకా కొన‌సాగుతున్నా థియేట‌ర్ల‌లో సంద‌డికి కొద‌వేమీ లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇటీవ‌ల ఉప్పెన స‌హా ప‌లు చిత్రాలు పోటాపోటీగా రిలీజ‌య్యాయి. వాట‌న్నిటి రిజ‌ల్ట్ బావుంది.

ఇంత‌లోనే `ఘని` రిలీజ్ ఎపుడు? అన్న చ‌ర్చా తాజాగా వ‌రుణ్ తేజ్ అభిమానుల్లో చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఒక మంచి రిలీజ్ తేదీని వెతికి చివ‌రికి  జూలై 30 న రిలీజ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. కానీ ఇంత‌లోనే రాధేశ్యామ్ డేట్ ని అదేరోజు ఫిక్స్ చేయ‌డంతో ప్రభాస్ అన్న‌కు ఎదురెళ్ల‌కుండా వ‌రుణ్ ప్లాన్ మార్చుకున్నార‌ట‌. కానీ ఘ‌ని టీమ్ ని మాత్రం ఈ మార్పు పెద్ద గందరగోళంలో పడేసింది. ప్ర‌భాస్ తో పోటీ స‌రికాదు కానీ కొత్త తేదీని నిర్ణ‌యించ‌డం ఎలా? అన్న‌దే స‌మ‌స్య‌గా మారింద‌ట‌.

లాక్ డౌన్ ఎత్తేశాక‌.. వెయిటింగులో ఉన్న‌వ‌న్నీ వెంట వెంట‌నే వ‌చ్చేస్తున్నాయి. చాలా విడుదలలు ఒకదాని తరువాత ఒకటిగా ఖ‌రారైపోయాయి. దీంతో థియేటర్లు బ్లాక్ అయిపోయాయ‌ట‌. ప్రతి వారం పెద్ద సినిమాలతో పాటు చిన్నా చిత‌కా సినిమాలు వ‌చ్చేస్తున్నాయి. దీంతో కొత్త‌వాటికి స్కోప్ దొర‌క‌డం లేద‌ట‌. దీంతో ఘ‌ని నిర్మాత‌లు డైల‌మాలో ఉన్నార‌ని స‌మాచారం.

ప్ర‌స్తుతం పోటీ లేని మంచి తేదీ కోసం వెతుకుతున్నారు.ఈ చిత్రంలో వ‌రుణ్ బాక్స‌ర్ గా న‌టిస్తున్నారు. త‌న పాత్ర ఎలివేష‌న్ కోసం బాక్సింగ్ తో పాటు మిక్స్ డ్ మార్ష‌ల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. కిరణ్ కొర్రపాటి అనే తొలి చిత్ర‌ దర్శకుడు ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు. ద‌బాంగ్ 3 ఫేం సాయి మంజ్రేకర్ కథానాయికగా నటించారు.
Tags:    

Similar News