ఈ నేషనల్ అవార్డు విన్నర్ గురించి ఎందుకు మాట్లాడట్లేరు..??

Update: 2021-03-25 01:30 GMT
ఇండస్ట్రీలో ఇంకా నేషనల్ అవార్డుల గోల తగ్గలేదు. ఎందుకంటే తెలుగులో రెండంటే రెండు సినిమాలకే రావడం ఆశ్చర్యకరమైన విషయం. అలాగే అందులోను యాక్టింగ్ విభాగంలో మాత్రం రాలేదు. అందులో రెండు పాపులర్ ఫిల్మ్, బెస్ట్ తెలుగు ఫిల్మ్ కేటగిరిలో గెలుపొందగా.. మరో రెండు బెస్ట్ కొరియోగ్రాఫర్, బెస్ట్ ఎడిటర్ విభాగాలలో గెలుపొందారు. అయితే ఇండస్ట్రీ అందరు సినిమాలు నేషనల్ అవార్డులు పొందినందుకు ఆనందంగానే ఉన్నారు. కానీ అభినందనల విషయంలో మాత్రం తారతమ్యం చూపిస్తున్నారు. ప్రస్తుతం ఇదే ఇండస్ట్రీలో చర్చించాల్సిన విషయం. ఒక హీరోకో లేక డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్.. ఇలా ఆఖరికి లిరిక్ రైటర్ లకు దక్కే ప్రోత్సాహం ఓ ఎడిటర్ విషయంలో మాత్రం ఎందుకు సైలెంట్ ఉంటున్నారో అర్ధం కావడంలేదు.

బెస్ట్ ఎడిటర్ విభాగంలో నవీన్ నూలి.. జెర్సీ సినిమాకు అందుకున్నాడు. ఎడిటర్ కు అవార్డు వచ్చినా బెస్ట్ సినిమా అంటూ.. నాని బెస్ట్ పెర్ఫార్మన్స్, డైరెక్టర్ ఇరగదీసాడు అంటున్నారు గాని.. ఎడిటింగ్ అదిరింది. అందుకే అవార్డు వచ్చింది అని ఎవరూ మాట్లాడుకోరు. ఎందుకంటే మొదటినుండి మనవాళ్లకు టెక్నీషియన్లకు పబ్లిక్ లో అంటే.. సోషల్ మీడియాలో అభినందనలు తెలిపే అలవాటు లేదు. సినిమా అదిరింది.. యాక్టింగ్ అదిరింది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు కానీ ఎడిటర్ నవీన్ నూలి గురించి మాత్రం ఎవరు నోరు మెదపడం లేదు. నిజానికి ఎడిటర్ గా నవీన్ ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలకు పనిచేసాడు. కానీ నేషనల్ లెవెల్లో బెస్ట్ ఎడిటర్ అవార్డు అందుకోవడం ఇదే మొదటిసారి. రంగస్థలం, నాన్నకు ప్రేమతో, అరవిందసమేత లాంటి సినిమాలకు నవీన్ పనిచేసాడు. రెండు నంది అవార్డులు కూడా ఇదివరకు అందుకున్నాడు. మరి ఇప్పుడైనా తెరవెనక హీరోలను అభినందిస్తారేమో చూడాలి!
Tags:    

Similar News