పూరి జగన్నాధ్ ఇప్పుడు తన కెరీర్ లో కాస్త స్లో అయ్యాడు కానీ ఆయనకు డాషింగ్ డైరెక్టర్.. స్పీడ్ డైరెక్టర్ అనే పేర్లు ఉన్నాయి. ఒక సినిమాకు కొబ్బరికాయ కొట్టే రోజే రిలీజ్ డేట్ చెప్పి మరీ అతి తక్కువ సమయంలో పూర్తి చేయగల సమర్థుడు పూరి. ఆయన ఎన్నో సార్లు అది నిరూపించాడు. మహేష్ లాంటి పెద్ద స్టార్ హీరోల అయినా పూరి స్టైల్ మాత్రం మారదు. రెండున్నర మూడు నెలల్లో షూటింగ్ కంప్లీట్ చేయడం పూరికి చాలా కామన్. కానీ ఈసారి మాత్రం పూరి స్లో అయ్యాడు.
పూరి జగన్నాధ్ ప్రస్తుతం రామ్ తో 'ఇస్మార్ట్ శంకర్' సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను షూటింగ్ ప్రారంభించిన సమయంలో మే నెలలో రిలీజ్ చేస్తామని ప్రకటించాడు. కానీ మే నెల వచ్చినా ఇంతవరకూ సినిమా షూటింగ్ పూర్తి కాలేదు. టీజర్ ట్రైలర్లు కూడా విడుదల చేయలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తుంటే ఈ సినిమా మే లో వచ్చేలా కనిపించడం లేదు. జూన్ లో రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఇది నిజంగా పెద్ద సర్ ప్రైజే.
పూరి కనుక తన రెగ్యులర్ స్టైల్లో చేసి ఉంటే ఈ పాటికే సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉండాలి. కానీ వరస పరాజయాల ఎఫెక్ట్ ఉందేమో కానీ జాగ్రత్త పడుతున్నాడు. ఈ సినిమాకు పూరి దర్శకుడు మాత్రమే కాదు.. నిర్మాత కూడా. అందుకే ఈసారి సినిమా విషయంలో ఏమాత్రం ఛాన్స్ తీసుకోకుండా హిట్ కోసం ప్లాన్ చేసుకుంటున్నాడు. ఏదేమైనా పూరి మేలో రిలీజ్ చేస్తాననే మాట తప్పినట్టే.