సాహో డేట్ ని మార్చాక ఇంకో రెండు వారాలు వాయిదా పడిందే తప్ప పెద్ద తేడా అనిపించలేదు. ఇది ప్రకటించి కూడా రెండు వారాలు దాటేసింది. సరిగ్గా లెక్కేస్తే ఇవాళ నుంచి కేవలం నెల రోజులు మాత్రమే టైం ఉంది. ఇప్పటికి వచ్చింది ఒక టీజర్ ప్లస్ ఆడియో సింగల్ మాత్రమే. అడపాదడపా పోస్టర్లు వదులుతున్నారు కాని అవేవి హైప్ ని అమాంతం పెంచేలా లేవు. ఆల్బంలోని రెండో పాట అదిగో ఇదిగో అంటున్నారు కాని డేట్ చెప్పడం లేదు.
ఇక ట్రైలర్ ఎప్పుడు వస్తుందో ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఎప్పుడు చేస్తారో అని డార్లింగ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఒకపక్క టీం మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చాలా బిజీగా ఉంది. విపరీతమైన ఒత్తిడి మధ్య డెడ్ లైన్ మీట్ అయ్యేందుకు నిర్మాతలకు కంటి మీద కునుకు పట్టడం కూడా కష్టమే. ఇలాంటి పరిస్థితిలో ఎక్కడ చూసినా సాహో గురించిన చర్చ జరగాలంటే ప్రమోషన్ స్పీడ్ చాలా పెంచాల్సి ఉంటుంది. ప్రభాస్ శ్రద్ధ కపూర్ లతో పాటు టీం మొత్తం మీడియాకు అందుబాటులోకి రావాలి.
డియర్ కామ్రేడ్ లాంటి రెగ్యులర్ లవ్ స్టొరీనే నాలుగు బాషలలో విడుదల చేస్తున్న కారణంగా ఆరు నగరాల్లో భారీ ఈవెంట్లు చేశారు. మరి ఇండియా వైడ్ రిలీజ్ ప్లాన్ చేసిన సాహోకు ఇంకే స్థాయిలో చేయాలో వేరే చెప్పాలా. కాని ప్రస్తుతానికి సాహో వైపు నుంచి అలాంటి సూచనలు ఏమి కనిపించడం లేదు. ఆగస్ట్ రెండో వారం నుంచి మొదలుపెడతారని ఇన్ సైడ్ టాక్ ఉంది. చూడాలి డార్లింగ్ బ్యాచ్ ఎప్పుడు రంగంలోకి దిగుతుందో