మెగాస్టార్ నటించిన తాజా చిత్రం 'ఆచార్య' ఎట్టకేలకు ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకురాబోతున్న విషయం తెలిసిందే. ఇందులో రామ్ చరణ్ కీలక అతిథి పాత్రలో నటించారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. పూజా హెగ్డే తో పాటు ఇందులో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ కూడా నటించింది. మ్యాట్నీ ఎంటర్‌టైన్ మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై శ్రీమతి సురేఖ సమర్పణలో నిరంజన్ రెడ్డి ఈ భారీ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ రిలీజ్ కి రెడీ అయినా గత కొన్ని రోజులుగా ఇందులో నటించిన కాజల్ అగర్వాల్ గురించి చిరు కానీ, చరణ్ కానీ, కొరటాల శివ కానీ స్పందించలేదు.
ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలోనూ కాజల్ గురించిన ప్రస్థావన రాలేదు. దీంతో కాజల్ అని కావాలనే టీమ్ పట్టించుకోవడం లేదనే వాదర మొదలైంది. సోషల్ మీడియా వేదికగా ఆమె అభిమానులు ఈ విషయంలో హర్ట్ అవున్నామంటూ పోస్ట్ లు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ వుందా? లేదా? అనే అనుమానాలు మొదలయ్యాయి. వీటికి దర్శకుడు కొరటాల శివ ఫైనల్ గా క్లారిటీ ఇచ్చారు. సినిమ ఆ కాజల్ వుందా? లేదా? అన్నది ఒక్క ముక్కలో తేల్చేశారు.
ఇటీవలే ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు కొరటాల శివ.. కాజల్ గురించి ఆసక్తికర విషయాల్ని బయటపెట్టి అభిమానులకు షాకిచ్చారు. ఫైనల్ గా 'ఆచార్య'లో కాజల్ పాత్ర లేదని క్లారిటీ ఇచ్చారు. ముందు సినిమా అనుకున్నప్పుడు హీరోకు ఆటోమెటిగ్గా హీరోయిన్ వుండాలనుకుంటాం.
అలా అనుకున్నప్పుడు 'ఆచార్య'లో ఓ ఫన్నీ క్యారెక్టర్ పుట్టింది. ధర్మస్థలిలో ఆ పాత్ర చాలా ఫన్నీగా సాగుతుంటుంది. ఆ పాత్రకు కాజల్ ని అనుకున్నాం. కానీ ఈ సినిమాలో 'ఆచార్య' పాత్రకు లవ్ వుండకూదు. అలాంటి పాత్రే ఆయన పక్కన వుండకూడదు.
ముందు ఈ పాత్ర పక్కన కాజల్ అనుకున్నప్పుడు 3 నుంచి 4 రోజులు షూటింగ్ చేశాం. ముందు పేపర్ మీద క్యారెక్టర్ అనుకున్నప్పుడే డౌట్ అనిపించింది. ఇక షూట్ చేసిన కొన్ని సీన్ లు చూశాక కూడా అదే ఫీలింగ్ కలిగింది. అంత పెద్ద హీరోయిన్.. ఏదో క్యారెక్టర్ వుండాలి కాబట్టి అన్నట్టుగా పెట్టకూడదు. పైగా 'ఆచార్య'కు తనంటే లవ్ ఇంట్రెస్ట్ లేదు. పాటలూ పెట్టలేం. అంతే కాకుండా ఆ పాత్రకు ప్రాపర్ గా కన్‌క్లూజన్ ఇవ్వలేం. నక్సలిజం భావాలున్న ఆచార్య పాత్ర పక్కన లవ్ అంటూ చూపించలేం. ఇన్ని లిమిటేషన్స్ మధ్య కాజల్ పాత్రని చిన్నగా చూపించడం చాలా తప్పు అనిపించింది.
చిన్న పాత్ర కోసం కాజల్ ని తప్పుగా చూపించినట్టుగా వుంటుందనిపించింది. ఇదే విషయాన్ని చిరంజీవిగారికి చెబితే నువ్వు నిమ్మింది చేయి అన్నారు. అదే విషయాన్ని కాజల్ కు చెప్పాను. విషయం అర్థమై నవ్వుతూ తప్పుకుంది. ఆ తరువాత సినిమా మిస్సవుతున్నానని ఫీలైంది కూడా. ఆలోచించి కాజల్ సహకరించినందుకు ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను' అని కొరటాల శివ అసలు విషయం బయటపెట్టడంతో కాజల్ అభిమానులు ఒక్కసారిగా షాక్ కు గురవుతున్నారు.
Full View
Full View Full View Full View Full View