దగ్గుబాటి రానా ఏంటీ సైలెంట్ అయిపోయాడు?. బ్యాక్ టు బ్యాక్ క్రేజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్రయత్నంచే రానా ఉన్నట్టుండి సినిమాల విషయంలో ఎందుకు సైలెంట్ అయిపోయాడు అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ ఏడాది రానా మూడు సినిమాల్లో నటించాడు. 1945, పవన్ కల్యాణ్ తో కలిసి 'భీమ్లానాయక్'లోనూ డేనియల్ శేఖర్ గా నటించిన ఆకట్టుకున్నాడు. ఆ తరువాత సాయి పల్లవితో కలిసి రానా నటించిన మూవీ 'విరాటపర్వం'.
చాలా కాలంగా రిలీజ్ విషయంలో తర్జన భర్జనలు పడిన తరువాత ఫైనల్ గా ఈ మూవీని జూన్ 17న విడుదల చేశారు. వేణు ఊడుగుల తెరకెక్కించిన ఈ మూవీని సరళ అనే ఓ యువతి కథ స్ఫూర్తితో తెరకెక్కించారు. రిలీజ్ కి ముందు భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ రిలీజ్ తరువాత మాత్రం ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. సాయి పల్లవి వెన్నెల పాత్రలో కనిపించి ప్రశంసల్ని మాత్రం దక్కించుకుందే కానీ ఈ మూవీతో అనుకున్న సక్సెస్ ని మాత్రం సొంతం చేసుకోలేకపోయింది.
సాయి పల్లవి పాత్ర ప్రధానంగా తెరకెక్కిన ఈ మూవీ తరువాత రానా మరో సినిమా అంగీకరించలేదు. గుణశేఖర్ తో చేయాలనుకున్న మైథలాజికల్ డ్రామా 'హిరణ్య కశ్యప'ని కూడా పక్కన పెట్టేశారు. 'విరాటపర్వం' తరువాత రానా నెట్ ఫ్లిక్స్ కోసం బాబాయ్ వెంకటేష్ తో కలిసి 'రానా నాయుడు' అనే వెబ్ సిరీస్ లో నటించాడు. షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది.
ఇదిలా వుంటే ఇంత వరకు రానా మరో ప్రాజెక్ట్ ని అంగీకరించకపోవడానికి ప్రధాన కారణం తన హెల్త్ సమస్యేనని తెలుస్తోంది. ప్రస్తుతం ఆరోగ్య సమస్యల నుంచి తేరుకున్నారట. నేడు డిసెంబర్ 14 రానా పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.
ఈ రోజు రానా కొత్త ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రకటన కోసం అభిమానులు భారీ స్థాయిలో ఎదురు చూస్తున్నారు. ఇదిలా వుంటే బుధవారం రానా నటించిన 'రానా నాయుడు' వెబ్ సిరీస్ తెలుగు టైటిల్ మోషన్ పోస్టర్ ని రానా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఇది నెట్టింట ట్రెండ్ అవుతోంది.
ఇక రానా మరో రెండు వెబ్ సిరీస్ లని ఓకే చేశాడని తెలిసింది. అంతే కాకుండా రానా, వెంకటేస్ ల కలయికలో డి. సురేష్‌బాబు ఓ భారీ మూవీని ప్లాన్ చేస్తున్నారట. ఇందు కోసం ఇప్పటికే స్టోరీని లాక్ చేశారని, వచ్చే ఏడాది ప్రకటించనున్నారని, ఈ ప్రాజెక్ట్ ని స్వయంగా సురేష్ బాబు నిర్మించనున్నారని తెలిసింది. త్వరలో రానా భారీ ప్రాజెక్ట్ లని మరిన్నింటినీ ప్రకటించే అవకాశం వుందని తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Video Here>> https://youtube.com/shorts/Jkn69bk-3m0?feature=share