బిగ్ బాస్ సరయూపై కేసు ఎందుకు బుక్ చేశారు?

Update: 2022-02-07 04:43 GMT
అందానికి అందం.. అంతకు మించిన ఆవేశం కలగలిపి.. మాట ఏదైనా మనసులో దాచుకోకుండా ఓపెన్ గా మాట్లాడేసే యూట్యూబ్ సంచలనం సరయూ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె చేసిన వీడియోలు చూస్తే.. అసలు సిసలు పటాసు మాదిరి కనిపించటం తెలిసిందే. ఈ బొద్దుగుమ్మ బిగ్ బాస్ 5లో పోటీదారుగా బరిలోకి దిగినప్పుడు ఆమెపై చాలానే అంచనాలు వ్యక్తమయ్యాయి.కానీ.. పోటీ నుంచి వారానికే బయటకు వచ్చేయటం షాకింగ్ గా మారింది. అయితే.. ప్రేక్షకులు ఆమెను రిజెక్టు చేసినట్లుగా బిగ్ బాస్ ప్రకటించటం.. దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా సరయూ చేసిన ఒక పని కారణంగా.. ఆమెపై కేసు నమోదైనట్లుగా చెబుతున్నారు. ఇటీవల ఒక హోటల్ ప్రచార పాటలో హిందువుల మనోభావాలు దెబ్బ తినేలా వ్యవహరించినట్లుగా ఆమెపై ఉన్న ఆరోపణ. దీనికి సంబంధించిన కంప్లైంట్ ను రాజన్న సిరిసిల్ల పోలీసులకు అందజేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. అనంతరం దీన్ని బంజారాహిల్స్ పోలీసు పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు.

ఇంతకూ అంత రచ్చకు కారణమైన పాటలో ఏముంది? అన్న విషయంలోకి వెళితే..హోటల్ ప్రమోషన్ సాంగ్లో సరయుతో పాటు మరికొందరు గణపతి బప్పా మోరియా బ్యాండ్నుతలకు ధరించినట్లుగా అశోక్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దేవుడి బొమ్మలు ధరించి.. లిక్కర్ తాగకూడదనే సంకేతాన్ని ప్రమోషన్ సాంగ్ తో పంపుతున్నట్లు ప్రకటించారు. హిందువుల మనోభావాల్ని కించపరిచినందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారు ఫిర్యాదు చేయటం గమనార్హం. ఈ కేసు నుంచి సరయూ క్షేమంగా ఎలా బయటపడుతుందో చూడాలి. 
Tags:    

Similar News