ఏడేళ్ల ప్రేమ బంధం ను నేడు మూడు మూళ్ళ బంధం తో మరింత పదిలం చేసుకున్నారు విఘ్నేష్ శివన్ మరియు నయనతార. మహాబలిపురంలో అత్యంత వైభవంగా జరిగిన ఈ పెళ్లి వేడుకలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తో పాటు కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్.. తమిళ స్టార్ హీరో సూర్య తో పాటు పలువురు ప్రముఖులు హాజరు అయ్యారు. వీరిది ప్రేమ వివాహం అయినా కూడా కట్నకానుకల గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది.
స్టార్ డమ్ విషయంలో నయనతార మరియు విఘ్నేష్ శివన్ ల మధ్య ఎంతటి వ్యత్యాసం ఉందో అందరికి తెల్సిందే. లేడీ సూపర్ స్టార్ గా ఒక్కో సినిమాకు మూడు నుండి అయిదు కోట్ల పారితోషికం తీసుకునే స్థాయి ఆమెది కాగా దర్శకుడు విఘ్నేష్ శివన్ ఇప్పుడిప్పుడే సినిమాల్లో రాణిస్తూ కెరీర్ లో ముందుకు వెళ్తున్నాడు. యువ దర్శకుడిగా పేరు దక్కించుకున్న విఘ్నేష్ శివన్ ఒక్కో సినిమా పారితోషికం తక్కువే ఉంటుందట.
ఇద్దరి సంపాదన విషయం పక్కన పెడితే ఇద్దరు కూడా ఒకరికి ఒకరు అన్నట్లుగా చాలా ఖరీదైన బహుమానాలు ఇచ్చుకున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా నయనతార చెన్నైలోని అత్యంత ఖరీదైన ఏరియాలో పాతిక కోట్లు పెట్టి ఒక ఇళ్లు కొనుగోలు చేసిందట. పెళ్లికి ముందే విఘ్నేష్ పేరు మీద ఆ ఇల్లును రిజిస్ట్రర్ చేయించినట్లుగా తెలుస్తోంది. పెళ్లికి అదే ఆయనకు నయన్ నుండి అందిన అతి పెద్ద బహుమానం.
ఇక నయనతార కు కూడా విఘ్నేష్ శివన్ చాలా బహుమానాలు ఇచ్చాడట. ఖరీదైన బంగారు ఆభరణాలతో పాటు విలువైన వస్తువులను కూడా విఘ్నేష్ ఇచ్చాడని తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. నయనతార మరియు విఘ్నేష్ శివన్ లు ధరించిన డ్రస్ లు మరియు ధరించిన బంగారు ఆభరణాల ఖరీదు దాదాపుగా 5 కోట్ల రూపాయల వరకు ఉంటుందట.
ఇద్దరు పెళ్లి కోసం ప్రత్యేకంగా చేయించుకున్న డైమండ్ రింగ్స్ కే కాస్త తక్కువ కోటి రూపాయల వరకు అయ్యిందట. ఇక పెళ్లి కోసం కూడా ఈ జంట భారీగా ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
పెళ్లికి ఖర్చు చేస్తున్న దానికి రెండు మూడు రెట్లు అధికం అన్నట్లుగా నెట్ ఫ్లిక్స్ వారు వీరి పెళ్లి రైట్స్ ను తీసుకుని డబ్బులు చెల్లించారట. మొత్తానికి అత్యంత ఖరీదైన పెళ్లిగా నయన్ విఘ్నేష్ శివన్ ల పెళ్లి నిలిచిందంటూ తమిళ మీడియా వర్గాల వారు చర్చించుకుంటున్నారు.