డీసెంట్ టార్గెట్ తో బరిలోకి 'వైల్డ్ డాగ్'.. రీచ్ అవుతుందా??

Update: 2021-03-30 03:30 GMT
కింగ్ నాగార్జున నటించిన 'వైల్డ్ డాగ్' మూవీ థియేట్రికల్ విడుదలకు రంగం సిద్ధమైంది. తెలుగు రాష్ట్రాలలో థియేటర్స్ తెరుచుకున్న రెండు నెలలకు వైల్డ్ డాగ్ రిలీజ్ డేట్ ఖరారైంది. ఎన్నో ఊహగానాల మధ్య సినిమా ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే వైల్డ్ డాగ్ ట్రైలర్ సినిమా పై అంచనాలు అమాంతం పెంచేసింది. నిజానికి ఈ సినిమాను ప్రముఖ ఓటిటిలో రిలీజ్ చేయాల్సినప్పటికీ ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి మంచి కలెక్షన్స్ అందిస్తున్నారనే ఉద్దేశంతో వైల్డ్ డాగ్ మేకర్స్ ఓటిటి నిర్ణయం వెనక్కి తీసుకున్నారు. అయితే యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా కథ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) బృందం చుట్టూ తిరుగుతుంది. కింగ్ నాగార్జున ప్రధానపాత్రలో నటించాడు.

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన ఓ రియల్ లైఫ్ టెర్రర్ దాడిని ఎన్‌ఐఏ బృందం ఎలా చేస్ చేసింది అనే కథాంశంతో వైల్డ్ డాగ్ రూపొందింది. అహిషర్ సోలమన్ అనే రచయిత ఈ సినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం కాబోతున్నాడు. ఇదిలా ఉండగా.. వైల్డ్ డాగ్ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ బాగానే జరిగినట్లు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం.. వైల్డ్ డాగ్ థియేట్రికల్ రిలీజ్ బిజినెస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 8కోట్లు చేసిందట. ఇక ప్రపంచవ్యాప్తంగా వైల్డ్ డాగ్ 9కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగబోతుందని టాక్. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాను విడుదల చేస్తోంది. నాగ్ ఈ సినిమాలో డిఫరెంట్ లుక్కులో కనిపిస్తున్నాడు. అలాగే రఫ్ అండ్ రియలిస్టిక్ క్యారెక్టర్స్ లో మిగతా యాక్టర్స్ దర్శనమిచ్చారు. చూడాలి మరి మినిమం టార్గెట్ వసూల్ చేస్తేనే వైల్డ్ డాగ్ సినిమా హిట్ అవుతుంది. చూడాలి మరి కింగ్ నాగ్ సక్సెస్ అవుతారేమో!


Tags:    

Similar News