టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభం నుంచీ ఇంతవరకు హిట్ అంటే తెలియని హీరోగా వెళ్తున్న అఖిల్ నాలుగో సినిమాగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' రూపొందుతుంది. ఈ సినిమాకు ప్రస్తుతం ప్లాపుల్లో ఉన్న బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా పై అక్కినేని ఫ్యామిలీ, అక్కినేని అభిమానులు ఆశలు మాములుగా పెట్టుకోలేదు. వరస ప్లాప్ లలో కూరుకుపోతున్న అఖిల్ ను బొమ్మరిల్లు భాస్కర్ సినిమా ఎంతవరకూ గట్టెక్కిస్తుందా.. అనేది సోషల్ మీడియాలో పెద్ద సవాల్ అయింది. పూర్తి ఫన్ తో, ఎమోషన్స్ తో ఈ సినిమాని రూపొందించారని చెప్తున్నారు. అఖిల్ ఈ సినిమాలో మధ్య తరగతి యువకుడిగా కనిపించనున్నారు. గీతా గోవిందం తరహాలో ఇదో రొమాంటిక్ ఎంటర్టైనర్. జీఏ2 పిక్చర్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు, వాసు వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఒకప్పుడు వరుస ప్లాప్ లలో ఉన్న నాగచైతన్యకు '100% లవ్' సినిమాతో హిట్ ఇచ్చిన నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్. ఇపుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా అదే బ్యానర్లో రూపొందుతుంది. అంటే ఇంతకాలం అఖిల్ చేసిన సినిమాలన్నీ సొంత బ్యానర్ లో రూపొందినవే. కాబట్టి నష్టం వచ్చినా పెద్దగా ఏమనుకోరు. కానీ మొదటిసారి బయట సంస్థ నిర్మిస్తుండటంతో అఖిల్ తనని తను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ సినిమా ఫ్యాన్స్ లో అఖిల్ స్టామినాను చూపించనుంది. అఖిల్ మార్కెట్ కూడా బయట పడుతుంది. కలెక్షన్స్ పరంగా అయితే అఖిల్ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవ్వాల్సిందే. లేదంటే మరో సినిమా చేయడానికి ఏ నిర్మాణ సంస్థ ముందుకు రాదు అనేది ప్రస్తుత టాక్. చూడాలి మరి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో అఖిల్ తన కెరీర్ కాపాడుకుంటాడా..? లేక మునుపటిలాగే బోల్తా కొడతాడా.. అని సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.