అవ‌తార్ -2కి ఆ రికార్డైనా అసాధ్య‌మేనా?

Update: 2022-12-21 05:30 GMT
'అవ‌తార్-2. ది వే ఆఫ్ వాట‌ర్' 2  బిలియ‌న్ డాల‌ర్ మార్క్ ని చేరుకోవ‌డం క‌ష్ట‌మేనా? వ‌ర‌ల్డ్ వైడ్ బాక్సాఫీస్ వ‌సూళ్లు మంద‌గిస్తున్నాయా? ఇదే వేగంతో ముందుకెళ్తే  ది వే ఆఫ్ వాట‌ర్  వ‌సూళ్ల ప‌రంగా వెనుక‌బ‌డ‌టం ఖాయ‌మేనా? అంటే అవున‌నే టాక్ వినిపిస్తుంది.  జేమ్స్ కామెరూన్  మొద‌టి భాగం అవతార్ (2009) ఇప్పటికీ $3 బిలియన్ల వసూళ్లతో వ‌ర‌ల్డ్ వైడ్ బాక్సాఫీస్ వ‌ద్ద‌ అతిపెద్ద హిట్‌గా నిలిచింది.

ప్ర‌పంచ‌ సినిమా చరిత్రలో కేవలం ఐదు సినిమాలు మాత్రమే 2 బిలియన్ డాలర్ల మార్కును దాటాయి. 'అవతార్'... 'ఎవెంజర్స్: ఎండ్ గేమ్'.. 'టైటానిక్'... 'స్టార్ వార్స్: ది ఫోర్స్ అవేకెన్స్'.. 'ఎవెంజర్స్: ఇన్ఫినిటీ వార్'కి మాత్ర‌మే ఇది సాధ్య‌మైంది. ఇప్పుడీ వ‌సూళ్లు అన్నింటి ది వేఆఫ్ వాట‌ర్  చేరిపేసి ప్ర‌పంచ బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త చ‌రిత్ర‌ని రాస్తుంద‌ని అంతా భావించారు.

అదే రేంజ్ లోనే కామెరూన్ ఏకంగా 13 ఏళ్ల పాటు శ్ర‌మించి రిలీజ్ చేసిన చిత్రం కావ‌డంతో అంచ‌నాలు అలాగే ఉండేవి. కానీ  అవతార్  సీక్వెల్ అవతార్: ది వే ఆఫ్ వాటర్ $2 బిలియన్ల మార్కును క్రాస్ చేయ‌డం కూడా క‌ష్టంగానే క‌నిపిస్తుంద‌న్న‌ది తాజా అప్డేట్.  ఇది  'ది వే ఆఫ్ వాటిర్' కి   అసాధ్యమైన కలగానే మిగిలిపోతుందనిపిస్తోంద‌న్న వాద‌న గ‌ట్టిగానే  వినిపిస్తుంది.

అవతార్ 2 దేశీయ వారాంతపు వసూళ్లు $134 మిలియన్లు సంపాదించింది.   సోమవారం $16.2 మిలియన్లతో బాగానే ఉంది. ఐదు రోజుల తర్వాత ఇప్పటి వరకు గ్లోబల్ కలెక్షన్స్ దాదాపు $500 మిలియన్లకు చేరుకున్నాయి. ఇదే వేగాన్ని కొన‌సాగిస్తే అవతార్ - ప్రపంచ వ్యాప్తంగా $2 బిలియన్ల మార్కును చేరుకోవడం చాలా కష్టమ‌నే అంటున్నారు ట్రేడ్ నిపుణులు.   కనీసం 1.48 బిలియన్ డాలర్లు వసూళ్లు సాధించిన  'టాప్ గన్: మావెరిక్‌'ను వ‌సూళ్ల‌ను కూడా బీట్ చేయ‌డం క‌ష్ట‌మంటున్నారు. 20222 లోనైనా అతి పెద్ద గ్రాస‌ర్ గా నిలుస్తుందా? అన్న‌ది సందేహం క‌నిపిస్తుంది.

అవతార్: ది వే ఆఫ్ వాటర్ కి  ప్రేక్షకుల నుంచి  డివైడ్ టాక్ వ‌చ్చింది.  క‌థ‌లో కొత్తదనం లేక‌పోవ‌డం...కేవ‌లం విజువ‌ల్ గానే హైలైట్ చేయ‌డం  వంటివి   ఓ సెక్ష‌న్ ఆడియ‌న్స్ కి అంత‌గా రుచించ‌లేదు.  సుదీర్ఘ రన్‌టైమ్ కూడా ఒక అడ్డంకిగా మారింది. దీంతో  షోలు తగ్గించబడతాయని వినిపిస్తుంది. అయితే అవతార్ ఎవెంజర్స్ లాంటి ఫ్రంట్ లోడెడ్ చిత్రం కాదని ఆశావాదులు అంటున్నారు. అవ‌తార్ వ‌సూళ్లు క్ర‌మేణా పెరుగుతాయ‌ని...సినిమాకి లాంగ్ ర‌న్ ఉంటుంద‌ని మ‌రికొంత మంది విశ్లేషిస్తున్నారు.

క్రిస్మస్ సెలవుల సీజన్‌ అవ‌తార్-2 వ‌సూళ్ల‌కు కీల‌కంగా మారే అవకాశం ఉందంటున్నారు. ఇండియాలో సినిమా నాలుగైదు వారాలు స్థిరంగా ఆడితే బాక్సాఫీస్ లెక్క‌లే మారిపోతాయ‌ని నివేదిక‌లు అంచ‌నా వేస్తున్నాయి. ఇక్క‌డ ఆ ర‌క‌మైన స్కోప్ క‌నిపిస్తుందంటున్నారు. 'అవ‌తార్' ప్రసాద్ ఐమాక్స్ బిగ్  స్ర్కీన్ లో ఏకంగా ఏడాది పాటు ఆడింది అన్న విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు.

ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ సినిమా బాగా క‌నెక్ట్ అవుతుంద‌ని...రాబోయే కొన్ని వారాంతాల్లో వారు సినిమాను భారీ స్థాయిలో ఆదరిస్తారని గెస్సింగ్స్ తెర‌పైకి వ‌స్తున్నాయి. ఈనేప‌థ్యంలో  అవతార్ 2ని ఫ‌లితాన్ని అప్పుడే నిర్దారించ‌డానికి ఛాన్స్ లేదంటున్నారు.  భారతదేశంలో అవతార్: ది వే ఆఫ్ వాటర్ 5 రోజుల్లో 160 మార్క్‌ను దాటింది.

మొదటి వారంలో 190 కోట్ల నెట్‌కు చేరుకుంటుందని అంచాన‌లున్నాయి. ఇండియాలోనే 300 కోట్ల వ‌సూళ్ల  సినిమా అవుతుం దంటున్నారు. అయితే బాలీవుడ్ లో రిలీజ్ అవుతున్న 'స‌ర్క‌స్'  కొంత వ‌ర‌కూ 'అవ‌తార్-2' వ‌సూళ్ల‌పై ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంది. ఆ సినిమాకి నెగిటివ్ టాక్ వ‌స్తే గ‌నుక నార్త్ లో 'అవ‌తార్ -2' దే హ‌వా అవుతుంద‌ని ట్రేడ్ అంచ‌నా వేస్తుంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News