అక్కినేని వారసుడు అఖిల్ కథానాయకుడిగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` రిలీజ్ ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. చిత్రీకరణ ప్రారంభమైన దగ్గర నుంచి సినిమా పనులన్ని నెమ్మదిగానే సాగాయి. అటుపై కరోనా రాకతో మరింత ఆలస్యమైంది. రిలీజ్ కి కరోనా బాగా అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో ఏడాదిగా రిలీజ్ తేదీలు ప్రకటించం.. వాయిదా వేసుకోవడం జరిగింది. ఇక చివరిగా దసరా కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 15న భారీ ఎత్తున థియేటర్లో రిలీజ్ కి రెడీ అవుతోంది. అయితే ఈ తేదీ అఖిల్ కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. సాధారణంగా దసరాకి చాలా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు. కరోనా కారణంగా షూటింగ్ అనుకున్న టైమ్ లో పూర్తి కాకపోవడంతో చాలా సినిమాలు షూటింగ్ లు పెండింగ్ ఉండిపోవడం..మరికొన్ని చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ పనులు డిలే కావడం వంటివి జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ దసరాకి బ్యాచిలర్ తప్ప మరో సినిమా బాక్సాఫీస్ బరిలో నిలవడం లేదని సమాచారం. బాలకృష్ణ నటిస్తోన్న `అఖండ` చిత్రాన్ని దసరాకి రిలీజ్ చేయాలని భావించారు. కానీ సాధ్యపడలేదు. అలాగే `ఆచార్య` సహా కొన్ని పెద్ద సినిమాలు..చిన్న చిత్రాలు కూడా డిలే కారణంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇవన్నీ అఖిల్ కి కలిసొచ్చే అంశాలు.
ఇప్పటివరకూ అఖిల్ కెరీర్లో సరైన సక్సెస్ లేదు. యావరేజ్ అనుకున్న సినిమాలకు అదే సమయంలో ఇతర రిలీజ్ ల ఇంపాక్ట్ పడింది. ఈసారి ఆ పరిస్థితి లేదు. సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నా.. డివైడ్ టాక్ తెచ్చుకున్నా `లవ్ స్టోరి` లా బండి లాగించేయడానికి ఆస్కారం ఉంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన చిత్రం కావడంతో బ్యాచిలర్ పైనా భారీ అంచనాలు ఉన్నాయి. మరి అఖిల్ టైమ్ ఎలా ఉంది అన్నది వేచి చూడాలి. ఏదేమైనా అఖిల్ కంటెంట్ తో సత్తా చాటాల్సి ఉంటుంది.
ప్రోమోలతో ఆసక్తిని పెంచాడు..!
`మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` టాలీవుడ్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. ఈ సినిమా ప్రోమోలు- పోస్టర్లు- టీజర్ ప్రేక్షకులలో గొప్ప ఆసక్తి ఉత్సుకతని రేకెత్తించాయి. ఇంతకుముందు రిలీజ్ తేదీని ప్రకటిస్తూ మేకర్స్ పోస్టర్ ను షేర్ చేసారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాన్ని 15 అక్టోబర్ 2021 న థియేటర్లలో విడుదల చేస్తామని ఇటీవల ప్రకటించారు. ఈ దసరాకి కుటుంబ సమేతంగా థియేటర్లకు వచ్చి ఆనందించదగిన చిత్రమిదని చిత్రబృందం ప్రకటించింది.
చాలా మంది అర్హతగల బ్యాచిలర్ లు ఇప్పుడు థియేటర్ల వైపు వెళ్లే ఛాన్సుంది. ఈ మూవీలో పూజాతో అఖిల్ రొమాన్స్ మరో లెవల్లో వర్కవుట్ చేస్తున్నారని తొలి నుంచి పోస్టర్లు టీజర్లు వెల్లడించాయి. తాజాగా రిలీజ్ తేదీని ప్రకటించేశారు కాబట్టి మునుముందు మరిన్ని బ్యాచిలర్ గ్లింప్స్ అలరించనున్నాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రీకరణ చాలా కాలం క్రితం ముగిసింది కానీ మహమ్మారి కారణంగా విడుదల ఆలస్యం అయింది. కరోనావైరస్ మొదటి .. రెండవ వేవ్ కారణంగా ఈ చిత్రం రెండుసార్లు వాయిదా పడింది. మొదట జనవరి 21 న రిలీజ్ అన్నారు. ఆపై జూన్ 19 న వస్తుందన్నారు. తర్వాత అక్టోబర్ 8న అన్నారు. కానీ మూడు సార్లు వాయిదా పడింది. ఇప్పుడు మరో కొత్త విడుదల తేదీని ప్రకటించారు. అక్కినేని అభిమానులు ఈసారి సినిమా చూడాలని ఆశతో ఎదురుచూస్తున్నారు.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. అతను ఏడు సంవత్సరాల తర్వాత తెలుగు సినిమాకి తిరిగి వస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా.. నేహా శెట్టి ఓ కీలక పాత్రలో కనిపించనుంది. కొత్త తరహా ప్రేమ కథగా రూపొందిన ఈ చిత్రాన్ని జిఎ 2 పిక్చర్స్ నిర్మిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నివాసు- వాసువర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోపి సుందర్ స్వరాలు సమకూర్చారు.