ఈ మధ్య విడుదలవుతున్న చిత్రాలకు పొలిటికల్ సపోర్ట్ బిగ్ ప్లాస్ గా మారుతోంది. పలు రాష్ట్రాల్లో ఆయా చిత్రాలకు ప్రధాన బలంగా నిలుస్తూ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. దీంతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అంశాల నేపథ్యంలో తెరకెక్కిన సినిమాల మేకర్స్ ప్రస్తుతం సెంట్రల్ లో పసవర్ లో వున్న భారతీయ జనతా పార్టీ అండ కోరుకుంటున్నారు. వారిని ప్రత్యేకంగా కలిసి సినిమాలని చూపిస్తూ సపోర్ట్ ని అడుగుతున్నారు.
దీంతో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆయా చిత్రాలకు టాక్స్ మినహాయింపు లభిస్తోంది. ఇటీవల కశ్మీర్ మారహోమం నేపథ్యంలో రూపొందిన వివాదాస్పద చిత్రం `ద కశ్మీర్ ఫైల్స్` చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. దీనికి స్వయంగా భారతీయ జనతా పార్టీ అండగా నిలిచింది. తమ పార్టీ అధికారంలో వున్న ఆయా రాష్ట్రాల్లో ఈ చిత్రానికి టాక్స్ మినహాయింపునివ్వడంతో ఈ మూవీ భారీ వసూళ్లని రాబట్టడమే కాకుండా దేశ వ్యాప్తంగా వసూళ్ల పరంగా సంచలనం సృష్టించింది.
త్వరలోనే ఈ చిత్రాన్ని తెలుగులో నూ విడుదల చేయబోతున్నారు. సౌత్ లోనూ ఈ చిత్రానికి బీజేపీ అండగా నిలవబోతోంది. దేశ భక్తి ప్రధానంగా సాగుతూ ముంబై తాజ్ హోటల్ ఎటక్స్ నేపథ్యంలో రూపొందిన చిత్రం `మేజర్`కు కూడా బీజేపీ అండగా నిలుస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఈ మూవీలో నటించిన హీరో అడివి శేష్, దర్శకుడు శశి కిరణ్ తిక్క రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని ప్రత్యేకంగా కలిసి ట్రైలర్ ని చూపించారు.
ఇండియన్ రియల్ హీరో మేజర్ ఉన్నికృష్ణన్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన సినిమా కావడం, టెర్రిరిస్ట్ ఎటాక్ కు సంబంధించిన మూవీ కావడంతో సెంట్రల్ ఈ మూవీకి ప్రత్యేకంగా టాక్స్ మినహాయింపుని ఇస్తే అవకాశం వుందని తెలుస్తోంది. ఇటీవల ఇదే తరహాలో టెర్రిరిస్ట్ లపై సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో రూపొందిన యురీ చిత్రానికి కేంద్రం టాక్స్ మినహాయింపుని అందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అడివి శేష్ నటించిన `మేజర్` చిత్రానికి కూడా ఇలాగే ట్యాక్స్ మినహాయింపుని ఇవ్వబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
అంతా అనుకున్నట్టే బీజేపీ ప్రభుత్వం మేజర్ కు అండగా నిలిస్తే దేశ వ్యాప్తంగా ఈ చిత్రానికి ఊహించని స్థాయిలో ఓపెనింగ్స్ రావడం ఖాయం అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. మరీ ముఖ్యంగా ఈ చిత్రానికి హిందీ బెల్ట్ లో భారీ స్థాయిలో వసూళ్లు దక్కే అవకాశం వుందని చెబుతున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలోనూ ఏక కాలంలో షూట్ చేశారు . కాబట్టి డబ్బింగ్ సినిమాగా కాకుండా మేజర్ అక్కడ స్ట్రెయిట్ హిందీ చిత్రంగా విడుదల కాబోతోంది. భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీని జూన్ 3న భారీ స్థాయిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బాబు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ పై అందిరి దృష్టిపడింది. ఇక బీజేపీ కూడా పచ్చ జెండా ఊపేస్తే `మేజర్` దేశ వ్యాప్తంగా సంచలనాలు సృష్టించడం ఖాయం.