ఇప్పుడు ప్రతీ దర్శకుడు.. ప్రతి ఒక్క హీరో పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. క్రేజ్ - ఇమేజ్ తో సంబంధం లేకుండా ఒక్కసారిగా మార్కెట్ ని విస్తరించుకోవాలని చూస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే కొందరు సక్సెస్ అవ్వగా.. మరికొందరు ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ డైరెక్టర్ బోయపాటి శ్రీను - యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కలిసి పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటడానికి రెడీ అవుతున్నారు.
ఊర మాస్ యాక్షన్ చిత్రాలతో దర్శకుడు బోయపాటి శ్రీను తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాలు హిందీలో డబ్ కాబడి యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ రాబడుతుంటాయి. 'అఖండ' చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు.. ఇకపై పాన్ ఇండియా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ముందుగా రామ్ తో ఓ భారీ మూవీ ప్లాన్ చేశారు
హిందీ డబ్బింగ్ చిత్రాలతో ఉస్తాద్ రామ్ నేషనల్ వైడ్ క్రేజ్ ఏర్పరచుకున్నారు. ప్రతీ సినిమా హిందీలోకి డబ్ కాబడి యూట్యూబ్ లో విశేష ఆదరణ దక్కించుకుంటున్నాయి. దీంతో నార్త్ ఇండియన్ ప్రేక్షకులకు రామ్ హాట్ షాట్ ఫేవరెట్ గా మారిపోయాడు. ఈ నేపథ్యంలోనే బోయపాటితో కలిసి భారీ మల్టీ లాంగ్వేజ్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు.
#BOTAPATIRAPO సినిమా కోసం మేకర్స్ దాదాపు 100 కోట్ల బడ్జెట్ అనుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. బోయపాటి చివరి సినిమా 'అఖండ' ను 56 కోట్లకు విక్రయించగా.. బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 70 కోట్లు వసూలు చేసింది. మరోవైపు రామ్ 'రెడ్' మూవీ 16 కోట్లు థియేట్రికల్ బిజినెస్ చేయగా.. 13 కోట్ల షేర్ మాత్రమే రాబట్టగలిగింది.
ఈ లెక్కలన్నింటిని బట్టి, ఈ ప్రాజెక్ట్ మీద నిర్మాతలు 100 కోట్లు ఖర్చు చేయడానికి ఎలా రెడీ అవుతున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ పవర్ ఫుల్ మాస్ అండ్ యాక్షన్ మూవీతో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ పెడితే మాత్రం బోయపాటి - రామ్ పోతినేనిల క్రేజ్ హద్దులు దాటే అవకాశం ఉంది.
ఇది దర్శక హీరోల కెరీర్లో ఫస్ట్ పాన్ ఇండియా సినిమా. అంతేకాదు బోయపాటి కెరీర్ లో 10వ చిత్రం.. రామ్ కు 20వ సినిమా. దీన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
బోయపాటి శ్రీను చిత్రాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ మరియు ఎమోషనల్ సీన్స్ ప్రత్యేకంగా నిలుస్తూ ఉంటాయి. ఇవే నార్త్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు దర్శకుడి ఊర మాస్ స్క్రిప్ట్ కు రామ్ ఎనర్జీ తోడైతే #BOTAPATIRAPO సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది. ప్రస్తుతం రామ్ నటిస్తున్న 'ది వారియర్' షూటింగ్ పూర్తైన తర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుంది.