టాలీవుడ్ హీరోల రేంజ్ ఇప్పుడు పాన్ ఇండియాకి రీచ్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్..రామ్ చరణ్..ఎన్టీఆర్.. అల్లు అర్జున్.. రాజమౌళి ఇలా ఒక్కొకరుగా పాన్ ఇండియా కేటగిరీలో పాపులర్ అవుతున్నారు. టాలీవుడ్ సెలబ్రిటీలు ఇండియా వైడ్ ఫేమస్ అవుతున్నారు. అన్ని భాషల్లోనూ తెలుగు స్టార్స్ వెలిగిపోతున్నారు.
ఇండియన్ సినిమా కీర్తి ప్రతిష్టాల్ని పెంచి తెలుగు సినిమా ఖ్యాతికెక్కుతోంది. దీంతో అన్ని భాషల పరిశ్రమలు ఇప్పుడు టాలీవుడ్ వైపు చూస్తున్నాయి. ఈ విషయాన్ని ఇంకాస్త ముందుగానే బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ పసిగట్టారు. ఆ నాటి నుంచి తెలుగు సెలబ్రిటీల్ని తన ఫేమస్ టాక్ షో `కాఫీ విత్ కరణ్` కి టాలీవుడ్ సెలబ్రిటీల్ని ఆహ్వానించి ముచ్చటించడం జరుగుతుంది.
ఇప్పటికే కరణ్ తో కాఫీని ..చరణ్..తారక్.. రాజమౌళి తో షేర్ చేసుకున్నారు. తాజాగా ఇప్పుడా వంతు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి దక్కినట్లు తెలుస్తోంది. ఏడవ సీజన్ ని అతిధులుగా బన్నీ తోపాటు రష్మికని ఆహ్వానిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. కరణ్ అదేశాల మేరకు నిర్వాహకులు ఆ ఇద్దర్ని సంప్రదించే పనిలో ఉన్నట్లు సమాచారం.
ఏడవ సీజన్ లో కరణ్ ఆ ఇద్దరి సెలబ్రిటలతో సర్ ప్రైజ్ కి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే `పుష్ప-2` రిలీజ్ కి ముందు ఎనలేని ప్రచారం దక్కుతున్నట్లుగా భావించొచ్చు. సినిమా విశేషాలతో పాటు బన్నీ ఓపెన్ గా మాట్లాడే అరుదైన అవకాశం ఆ వేదికపై దొరుకుతుంది. కరణ్ టాక్ షోలో ఎన్నో విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
ఇదే గనుక నిజమైతే బన్నీకిది `పుష్ప ది రైజ్` తెచ్చిన అవకాశంగా చెప్పొచ్చు. పుష్ప మొదటి భాగం హిందీ బెల్ట్ లో ఏ రేంజ్ లో సక్సెస్ సాధించిందో చెప్పాల్సిన పనిలేదు. తెలుగు రాష్ర్టాల వసూళ్లకి ధీటుగా అక్కడా భారీ వసూళ్లు సాధించింది. తొలి షోతోనే పాజిటివ్ టాక్ రావడంతో ఉత్తరాది ఆడియన్స్ `పుష్ప` థియేటర్ ముందు క్యూ కట్టారు. దీంతో బన్నీ హిందీ బెల్ట్ లో బాగా పాపులర్ అయ్యాడు. `పుష్ప-2` కోసం తెలుగు ఆడియన్స్ కన్నా ఎక్కువ ఎగ్జైట్ మెంట్ తో హిందీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం బన్నీ రెస్ట్ లో ఉన్నాడు. దర్శకుడు సుకుమార్ రెండవ భాగం స్ర్కిప్ట్ కి సంబంధించి తుది మెరుగులు దిద్దుతున్నారు. ప్రీ ప్రొడక్షన్ మొత్తం పూర్తిచేసి జులైలో షూటింగ్ ప్రారంభించాలని రెడీ అవుతున్నారు. వచ్చే ఏడాది సినిమా రిలీజ్ చేయనున్నారు. వాస్తవానికి ఇదే ఏడాదిలో రిలీజ్ ప్లాన్ చేసారు. కానీ తొలి భాగం సక్సెస్ సహా...వచ్చిన చిన్నపాటి విమర్శల నేపథ్యంలో స్ర్కిప్ట్ లో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.