గత ఏడాది ప్రారంభంలో 'బంగార్రాజు'తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు నాగచైతన్య. ఈ మూవీతో శుభారంభాన్ని దక్కించుకున్న నాగచతైన్య ఆ తరువాత బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్ని చవి చూశాడు. బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ తో కలిసి'లాల్ సింగ్ చద్దా'తో బాలీవుడ్ లో తెరంగేట్రం చేశాడు. అయితే ఈ మూవీ బాయ్ కాట్ కు గురి కావడం, సినిమా కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అనిపించుకుని షాకిచ్చింది.
ఇక 'మనం' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందించిన విక్రమ్ కె. కుమార్ డైరెక్షన్ లో చేసిన 'థాంక్యూ' ఏ విషయంలోనూ ఆకట్టుకోలేకపోయింది. దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ కోసం ఏపీలోని పలు థియేటర్లు టికెట్ పై డిస్కౌంట్ ని ప్రకటించడంతో 'థాంక్యూ ' వార్తల్లో నిలిచింది. వరుస ఫ్లాపుల తరువాత నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కస్టడీ'. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని తెలుగుతో పాటు తమిళంలోనూ ఏక కాలంలో ద్విభాషా చిత్రంగా నిర్మిస్తున్నారు.
రీసెంట్ గా ఈ మూవీ గ్లిమ్స్ ని విడుదల చేశారు. సినిమాలో నాగచైతన్య యాక్షన్ హీరోగా కనిపించబోతున్నట్టుగా తెలుస్తోంది. గ్లిమ్స్ సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. ఈ సినిమాతో నాగచైతన్య హిట్టు కొట్టబోతున్నాడా? అని అని అందరిలోనూ చర్చ మొదలైంది. విభిన్నమైన సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి వెంకట్ ప్రభు. చెన్నై600028, సరోజా, గోవా వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లని సొంతం చేసుకున్నాడు.
అయితే అజిత్ తో చేసిన 'మన్కత' మూవీతో భారీ విజయాన్ని దక్కించుకుని స్టార్ డైరెక్టర్ ల లీగ్ లోకి చేరిపోయారు. కానీ ఆ తరువాత మాత్రం ఆశించిన సక్సెస్ లని దక్కించుకోలేక వెనక బడ్డాడు. రీసెంట్ గా 'మానాడు' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ని దక్కించుకుని మళ్లీ ట్రాక్ లోకి వచ్చేశాడు. సరికొత్త స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేసిన వెంకట్ ప్రభు 'కస్టడీ' విషయంలోనూ అదే మ్యాజిక్ ని కంటిన్యూ చేస్తాడా? .. నాగచైతన్యకు సక్సెస్ ని అందించిన మళ్లీ తనని సక్సెస్ ట్రాక్ లోకి తీసుకెళతాడా అన్నది ఆసక్తికరంగా మారింది.
కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలోని కీలక పాత్రల్లో ప్రియమణి, శరత్ కుమార్, వెన్నెల కిషోర్, సంపత్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టైలిష్ విలన్ గా అరవిందస్వామి కనిపించబోతున్నారు. రామ్ చరణ్ నటించిన 'ధృవ'లో అరవింద స్వామి స్టైలిష్ విలన్ గా నటించి సినిమాకు ప్రధాన బలంగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగచైతన్యకు వెంకట్ ప్రభు సక్సెస్ ని అందిస్తాడా? తన మ్యాజిక్ ని మళ్లీ రిపీట్ చేస్తాడా? అన్నది వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.