ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు చిన్న కొడుకు, హ్యాండ్సమ్ హంక్ రానా తమ్ముడు అభిరామ్ దగ్గుబాటి "అహింస" అనే సినిమాతో హీరోగా తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్ల నుంచి ఇదిగో వస్తున్నాడు అదుగో వస్తున్నాడు అంటూ వార్తలు వచ్చాయి కానీ.. కొన్ని కారణాలతో అతని ఎంట్రీ ఆలస్యమవుతూ వచ్చింది. ఇప్పుడు ఫైనల్ గా క్రియేటివ్ జీనియస్ తేజ చేతుల మీదుగా దగ్గుబాటి వారసుడు లాంచ్ అవుతున్నాడు.
'అహింస' అనేది యూత్ ఫుల్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని తెలుస్తోంది. అహింసా సిద్ధాంతాన్ని ఫాలో అయ్యే యువకుడికి హింస కలిసినప్పుడు ఏమి జరుగుతుంది? అనే పాయింట్ మీద తేజ మార్క్ లవ్ స్టొరీగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఒక సాధారణ పల్లెటూరి యువ రైతుగా అభిరామ్ ని ప్రెజెంట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ - సాంగ్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
తేజ గతంలో తీసిన 'నువ్వు నేను' 'జయం' మరియు 'ఔనన్నా కాదన్నా' వంటి టీనేజ్ ప్రేమకథా చిత్రాల తరహాలోనే.. "అహింస" సినిమా ఉంటుందని ప్రమోషనల్ కంటెంట్ ని బట్టి తెలుస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. దానికి సరైన రిలీజ్ డేట్ కోసం మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు.
దగ్గుబాటి వారసుడి డెబ్యూ మూవీని మంచి తేదీకి విడుదల చేయాలని భావిస్తున్నారు. అయితే పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ వెతకడం సురేష్ బాబుకి కష్టమైన పనిగా మారిందని తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ప్రతి వారం రెండు మూడు సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. పెద్ద సినిమాలకే సోలో రిలీజ్ దొరకడం చాలా కష్టమైంది. ఫెస్టివల్ సీజన్స్ ని క్రేజీ బిగ్ సినిమాకు వదిలేసి.. మిగతా తేదీలలో చిన్న మీడియం రేంజ్ చిత్రాలు వస్తున్నాయి.
అభిరామ్ సాలిడ్ ఎంట్రీ ఇచ్చేలా ఇప్పుడు "అహింసా" సినిమా కోసం ఎలాంటి పోటీ లేకుండా సరైన డేట్ ని లాక్ చేయాలని చూస్తున్నారట. కాకపోతే ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రతీవారం కొత్త సినిమాల రిలీజులు ఉంటున్నాయి. దీపావళి మొదలు కొని వచ్చే సంక్రాంతి వరకూ అన్ని స్లాట్స్ బుక్ అవుతున్నాయి. మరి వాటి మధ్యలో దగ్గుబాటి హీరో డెబ్యూకి బెస్ట్ రిలీజ్ డేట్ దొరుకుంటుందేమో చూడాలి.
కాగా. 'అహింస' చిత్రంలో అభిరామ్ సరసన గీతిక హీరోయిన్ గా నటించింది. సదా - రజత్ బేడీ - రవి కాలే - కమల్ కామరాజు - మనోజ్ టైగర్ - కల్పలత - దేవి ప్రసాద్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఆర్‌పి పట్నాయక్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. తేజ మరియు ఆర్పీ కలయికలో చాలా కాలం తర్వాత వస్తున్న సినిమా ఇది. దీనికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ చేసారు.
ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై పి కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటి వరకు ఎంతో మంది కొత్తవాళ్ళని ఇండస్ట్రీకి పరిచయం చేసిన క్రియేటివ్ డైరెక్టర్ తేజ.. ఇప్పుడు 'అహింస' వంటి వైవిధ్యమైన ప్రేమకథా చిత్రంతో అభిరామ్ ని సక్సెస్ ఫుల్ గా లాంచ్ చేస్తాడేమో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.