మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన 'దృశ్యం' సినిమా అన్ని ప్రధాన భాషల్లో రీమేక్ కాబడి ఘన విజయం సాధించింది. ఓ మిడిల్ క్లాష్ ఫ్యామిలలో అనుకోని సంఘటన కారణంగా కష్టాలు ఎదురైతే ఆ కుటుంబ పెద్ద, తన వారిని ఎలా కాపాడుకున్నాడన్న కథతో ఈ సినిమా వచ్చింది. జీతూ జోసెఫ్ ఈ చిత్రాన్ని ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందించారు. ఇక దీనికి సీక్వెల్ గా మలయాళంలో వచ్చిన ''దృశ్యం 2'' ఇటీవల ఓటీటీలో విడుదలై మంచి వ్యూయర్ షిప్ తెచ్చుకుంటోంది. ఇప్పుడు ఈ సీక్వెల్ ని కూడా తెలుగులో రీమేక్ చేయనున్నారు.
విక్టరీ వెంకటేష్ - మీనా ప్రధాన పాత్రలతో మాతృకను డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫ్ ఈ తెలుగు రీమేక్ ను తెరకెక్కించనున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డి. సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మార్చి ఫస్ట్ వీక్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేసి కేవలం 50 రోజుల్లో పూర్తి చేసేలా ప్లాన్స్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'దృశ్యం 2' తెలుగు ఆడియన్స్ ని ఎంత మేరకు మెప్పిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. మలయాళ 'దృశ్యం 2' సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదల అయింది. లాక్ డౌన్ పుణ్యమా అని తెలుగు ప్రేక్షకులు కూడా సబ్ టైటిల్ పెట్టుకుని మరీ ఈ సినిమాని చేసేశారు.
అందులోని ట్విస్టులు ఆల్రెడీ రివీల్ అయ్యాయి. అంతేకాకుండా ఫస్ట్ హాఫ్ మరీ స్లో గా ఉందని.. ఓటీటీలో కాబట్టి చూడొచ్చు అనే కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు తెలుగులో కూడా సీన్ టూ సీన్ తీసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలుగు రీమేక్ ని థియేటర్స్ లో ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో అనే డౌట్స్ వ్యక్తం అవుతున్నాయి. కాకపోతే వెంకటేష్ తన పెర్ఫార్మన్స్ తో ఇప్పటికే అనేక సినిమాలని సక్సెస్ ఫుల్ గా రీమేక్ చేశాడు. ఇప్పుడు 'దృశ్యం' తరహాలోనే దాని సీక్వెల్ సినిమాని కూడా విజయం వైపు నడిపిస్తాడని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.