'ఫిఫా'ను కూడా బాయ్‌కాట్ చేస్తారా?

Update: 2022-12-19 06:30 GMT
'ప‌ఠాన్' సినిమా కోసం దీపికా ప‌దుకొణే ధ‌రించిన బికినీ రంగు ట్రీట్ పై  బ‌య‌ట జ‌రుగుతోన్న ర‌చ్చ గురించి తెలిసిందే. భాజాపా నేతలు  దీపిక బికినీ పై త‌మ‌దైన శైలిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ప్ర‌తిగా కొంద‌రు సెల‌బ్రిటీలు ...భాజాపా వ్య‌తిరేక వ‌ర్గం స‌హా ప‌లు రాజ‌కీయ పార్టీలు దీపిక కు అండ‌గా నిలుస్తున్నారు. అమితాబ‌చ్చ‌న్ ప‌రోక్షంగా పఠాన్ కి మ‌ద్ద‌తుగా నిల‌వ‌డంతో? అది ఏకంగా  బీజేపీ-తృణ‌మూల్ పార్టీల మధ్య రాజ‌కీయ‌ చిచ్చుకే తెర తీసిన సంగ‌తి తెలిసిందే.

అమితాబ్  వ్యాఖ్య‌లు ప‌క్క‌కు పోయి ఆ రెండు పార్టీల నేత‌లు వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు దిగారు. అలాగే విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ కూడా దీపిక‌కి మ‌ద్ద‌తుగా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ప‌రోక్షంగా బీజేపీపైనా త‌న‌దైన వైలిలో సెటైర్లు గుప్పించారు. దీంతో కొంత మంది నెటి జ‌నుల‌కు ప్ర‌కాష్ రాజ్ నెగిటివ్ గామారాడు. ఆయ‌న్ని టార్గెట్ చేసి వ్యాఖ్య‌లు చేస్తున్నారు.

అయినా స‌రే నేను త‌గ్గేదేలే అంటూ విల‌క్ష‌ణ న‌టుడు మ‌రోసారి దీపిక‌కి అండ‌గా నిలిచాడు. ఫిపా ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ లో దీపికా ప‌దుకొణే క‌ప్పును ఆవిష్క‌రించిన ఫోటోని చూసి షూర్ చేసి 'నిన్ను చూసి గ‌ర్వంగా' ఉంది అంటూ దీపిక‌ని ఉద్దేశించి స్పందించారు.  ఈ 'బేష‌రామ్ బిగోట్స్' ఇప్పుడు ఫిపా ప్ర‌పంచ క‌ప్ ని కూడా బ్యాన్ చేస్తారా?  అన సూటిగా ప్ర‌శ్నించాడు.

ఇది నేరుగా దీపిక‌ని సోష‌ల్ మీడియాలో విమ‌ర్శించిన వారికి....బేజేపీ నేత‌ల‌కు త‌గుల్తోంది. బేష‌రామ్ పాట‌లోనే దీపిక ధ‌రించిన బికినీ ఇంత‌ర‌కు ర‌చ్చ‌కు దారి తీసింది. అందుకే బేష‌రమ్ బిగోడ్స్ అంటూ ప్ర‌కాష్ రాజ్ వ్యాఖ్యానించారు. ఇప్ప‌టికే మంటెత్తి పోయిన గ్యాంగ్ పై విల‌క్ష‌ణ న‌టుడు ఈ వ్యాఖ్య‌లతో మ‌రింత ఆజ్యం పోసిన‌ట్లు క‌నిపిస్తుంది. మొత్తానికి సౌత్ నుంచి ప్ర‌కాష్  రాజ్ దీపిక ప‌దుకొణే బికినీకి అండంగా నిల‌బ‌డ‌టం విశేషం.  ప్ర‌స్తుతం దీపిక తెలుగులో డార్లింగ్ ప్ర‌భాస్ స‌ర‌స‌న 'ప్రాజెక్ట్-కె' లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News