మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ''కేజీయఫ్: చాప్టర్ 2'' వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కన్నడ రాకింగ్ స్టార్ యష్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ యాక్షన్ చిత్రంపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
నాలుగేళ్ళ క్రితం 'కేజీయఫ్ 1' సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ విజయం సాధించింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా రూపొందిన 'కేజీఎఫ్ 2' కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 14న ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. 'కేజీఎఫ్: చాప్టర్ 2' ని తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మరియ తెలంగాణ రాష్ట్రాల్లో టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 110 కోట్లకు పైగా ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
'కేజీఎఫ్ చాప్టర్ 1' ఫుల్ రన్ లో తెలుగు స్టేట్స్ లో రూ. 12.30 కోట్ల షేర్ వసూలు. అంటే ఇప్పుడు 'చాప్టర్ 2' రేట్లు దాదాపు 10 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. సినిమా మీదున్న హైప్ వల్ల టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల రేంజ్ లో నైజాంలో 50 కోట్లు - సీడెడ్ లో 20 కోట్లకు ఈ సినిమాని తీసుకున్నట్లు టాక్.
అయితే అంత మొత్తంలో డబ్బు పెడుతున్నప్పుడు అవి తిరిగి పొందాలంటే ప్రభుత్వాల సపోర్ట్ కచ్చితంగా అవసరం ఉంటుంది. నిర్మాతలు కోరితే ఏపీ తెలంగాణాలో భారీ బడ్జెట్ సినిమాలను ప్రత్యేకంగా పరిగణించి కొన్ని రోజులు సాధారణ టికెట్ ధరల కంటే అధికంగా అమ్మడానికి అనుమతి ఇస్తూ ఉంటాయి.
ఇప్పుడు 'కేజీఎఫ్ 2' సినిమా టికెట్ ధరల పెంపు కోసం ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యేక పెంపుదల అనుమతులు ఒకటి రెండు రోజుల్లో అందే అవకాశం ఉందని మేకర్స్ భావిస్తున్నారు. అయితే ఆంధ్రాలో టికెట్ రేట్లు పెంచుకోడానికి కొన్ని షరతులు ఉన్నాయి.
మరి ఏపీలో 'కేజీఎఫ్ 2' చిత్రానికి ఎంత మేర స్పెషల్ హైక్స్ ఉంటాయో చూడాలి. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరల పెంపు అనుమతులు వచ్చిన వెంటనే సోమవారం అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవుతాయని తెలుస్తోంది. ఇప్పటికే ఇతర భాషల్లో బుకింగ్స్ తెరుచుకున్నాయి.
కాగా, 'కేజీఎఫ్ 2' చిత్రంలో యష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్ - రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. ప్రకాష్ రాజ్ - రావు రమేష్ - ఈశ్వరీ రావు తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. రవి బస్రుర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.
హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. కరోనా పాండమిక్ వల్ల విడుదల ఆలస్యం అవుతున్నప్పటికీ.. ఇన్నాళ్లు ఆగి థియేట్రికల్ రిలీజ్ కు రెడీ చేశారు. ఇప్పటికే విడుదలైన చాప్టర్-2 ప్రచార చిత్రాలు - ట్రైలర్ - రెండు పాటలు అనూహ్య స్పందన తెచ్చుకున్నాయి.
2 గంటల 48 నిమిషాలు (168 నిమిషాలు) రన్ టైంతో 'కేజీఎఫ్ 2' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదల కానుంది. మరికొన్ని రోజుల్లో రానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.