సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా ఏ.ఆర్.మురుగదాస్ తెరకెక్కించిన `స్పైడర్` 2017 సెప్టెంబర్ లో రిలీజైంది. ఇప్పటికే రెండేళ్లవుతోంది. ఆ సినిమా రిజల్ట్ గురించి తెలిసిందే. స్పైడర్ మహేష్ కెరీర్ లో తీపి గురుతుగా నిలుస్తుంది అనుకుంటే తెలుగులో డిజాస్టర్ రిజల్ట్ అందుకుంది. తమిళంలో ఫర్వాలేదు అనిపించే వసూళ్లు సాధించింది. ఈ సినిమా రిలీజ్ ముందు డైలమా గురించి తెలిసిందే. అంతకంతకు కాన్వాసును పెంచేస్తూ మురుగదాస్ రిలీజ్ ఆలస్యానికి కారణమవ్వడంతో మహేష్ చాలా సీరియస్ అయ్యారని వార్తలొచ్చాయి.
అదంతా అటుంచితే నేడు సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపిన మురుగదాస్ ట్విట్టర్ వాల్ పోస్టర్ గా స్పైడర్ పోస్టర్ ని పెట్టుకోవడం అభిమానుల కంట పడింది. సినిమా హిట్టయినా ఫ్లాపయినా ఏ దర్శకుడికి అయినా అది బిడ్డతో సమానం అని ఫీలవుతారు. ఇప్పటికీ ఈ సినిమా ఏ.ఆర్.మురుగదాస్ ఫేవరెట్ సినిమానే అని అర్థమవుతోంది. ఏ సినిమా చేసినా ప్రేమించి చేయడం మురుగదాస్ అలవాటు. కానీ రకరకాల కారణాలతో `స్పైడర్` డిజాస్టర్ రిజల్ట్ అందుకుంది. ఆ సినిమా తర్వాత మహేష్ తో మరో సినిమా చేసే వీలుందో లేదో ఇప్పటికైతే తెలీదు.
`స్పైడర్` ఫ్లాప్ తర్వాత ఇరుగు పొరుగు దర్శకుల వైపు చూడకుండా మహేష్ బుద్ధిగా తెలుగు దర్శకులకే అవకాశాలిస్తున్నారు. దర్శకరచయిత.. ఎదురే లేని ట్యాలెంట్ కొరటాల శివతో రెండు సినిమాలు చేశారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో `మహర్షి` చిత్రంలో నటించారు. ఆ ఇద్దరూ మహేష్ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ఇప్పుడు `ఎఫ్ 2` ఫేం అనీల్ రావిపూడికి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఎస్.ఎస్.రాజమౌళి.. పరశురామ్.. సందీప్ రెడ్డి వంగా.. ఇలా పెద్ద లైనప్ ఉంది. ఇందులో అందరూ తెలుగు దర్శకులే ఉన్నారు.