పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గతం కంటే పూర్తి భిన్నంగా బ్యాక్ టు బ్యాక్ క్రేజీ సినిమాల్లో నటిస్తున్నారు. 'బాహుబలి' సీరీస్ సినిమాల తరువాత ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోవడం.. మార్కెట్ స్టాయి కూడా పాన్ ఇండియా రేంజ్ కి మించడంతో చాలా వరకు క్రేజీ ప్రొడక్షన్ కంపనీలు ప్రభాస్ తో భారీ స్థాయి సినిమాలు నిర్మించాలని పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ 'కేజీఎఫ్' మేకర్స్ హోంబలే ఫిలింస్ వారితో 'సలార్' మూవీని చేస్తున్న విషయం తెలిసిందే.
ఇదే సమయంలో బాలీవుడ్ మేకర్స్ టి సిరీస్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో నిర్మిస్తున్న మైథలాజికల్ డ్రామా 'ఆది పురుష్'లో నటిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ టీజర్ రిలీజ్ తరువాత నెటిజన్ ల ట్రోల్ కి గురికావడం, మేకర్స్ ఈ ట్రోల్స్ ని దృష్టిలో పెట్టుకుని మళ్లీ గ్రాఫిక్స్ కోసం దాదాపు రూ. 100 కోట్లు ఖర్చు చేయడానికి రెడీ అయ్యారట. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ రిలీజ్ ని వాయిదా వేస్తూ జూన్ 16న ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామంటూ ఇటీవల అధికారికంగా ప్రకటించారు.
ఇక ఈ మూవీతో పాటు ప్రభాస్ టాలీవుడ్ లో భారీ సినిమాల నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్ సి. అశ్వనీదత్ అత్యంత భారీ స్థాయిలో దాదాపు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్ తో 'ప్రాజెక్ట్ కె'ని తెరకెక్కిస్తున్నారు. నాగ్ అశ్విన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న సైన్స్ ఫిక్షన్ ఇది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ తరువాత మారుతి డైరెక్షన్ లోనూ ఓ హారర్ థ్రిల్లర్ కు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ సైలెంట్ గా మొదలైంది. 'రాజాడీలక్స్' అనే ఓ సినిమా థియేటర్ నేపథ్యంలో హారర్ థ్రిల్లర్ గా ఈ మూవీని తెరపైకి తీసుకురాబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీలో ప్రభాస్ కు జోడీగా మాళవికా మోహనన్, నిధి అగర్వాల్ నటించనున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
సందీప్ రెడ్డి వంగతోనూ ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్ తో ఇంత బిజీ షెడ్యూల్ లో మైత్రీ మూవీ మేకర్స్ వారు ఓ భారీ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుడుతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
'వార్', పఠాన్ చిత్రాల దర్శకుడు సిద్దార్ధ్ ఆనంద్ ఈ మూవీని డైరెక్ట్ చేయనున్నారని, ఇందు కోసం అతనికి ఇప్పటికే మైత్రీ వారు రూ. 80 కోట్లు ఇచ్చారని, దానికి ఇప్పటికీ ఇంట్రెస్ట్ లు కడుతున్నారని ఇన్ సైడ్ టాక్. ఈ భారీ లైనప్ మధ్య ప్రభాస్ తో భారీ పాన్ ఇండియా మూవీని తెరపైకి తీసుకురావాలన్న మైత్రీ వారి కల ఎప్పటికి నెరవేరుతుందా అన్నది వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.