'దసరా'తో నాని ఆశ నెరవేరుతుందా?

Update: 2022-10-25 05:35 GMT
న్యాచురల్ స్టార్ నాని ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 14 ఏళ్ళు గడుస్తోంది. 2008లో 'అష్టచమ్మా'తో నాని వెండితెరకు హీరోగా పరిచయమయ్యాడు. ఇందులో అతడికి నటుడిగా మంచి మార్కులు పడ్డాయి. నాటి నుంచి ప్రతీయేటా ఒకటి రెండు సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. 2021లో 'టక్ జగదీష్'.. 'శ్యామ్ సింగరాయ్'.. 2022లో 'అంటే సుందరానికి' సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.

'టక్ జగదీష్'..పర్వాలేదనిపించినా 'శ్యామ్ సింగరాయ్' మాత్రం భారీ కలెక్షన్లను రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద నాని సత్తా ఏంటో నిరూపించింది. ఈ మూవీలో నాని డ్యూయల్ రోల్ చేయగా.. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లు నటించారు. ఈ సినిమా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహించారు.

'శ్యామ్ సింగరాయ్' సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. దర్శకుడు రాహుల్ సంకృత్యన్.. నాని.. సాయి పల్లవిలు సక్సస్ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకున్నారు. అయితే నాని ఎప్పటి నుంచో మాస్ హీరో నిరూపించుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణతో కలిసి 'వీ' మూవీ చేశాడు.

నాని 25వ సినిమాగా తెరకెక్కిన 'వీ'ను దర్శకుడు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు.  నాని ఇందులో నెగిటివ్ షెడ్ ఉన్న క్యారెక్టర్లో, మరో హీరోగా సుధీర్ బాబు నటించాడు.  అయితే కరోనా కారణంగా థియేటర్లు మూతబడటంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజు చేయాల్సి వచ్చింది. దీని కంటే ముందు 'జెండాపై కపి రాజు'.. 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' సినిమాల్లో మాస్ అప్పియరెన్స్ కోసం ప్రయత్నించాడు.

ఈ సినిమాలతో తనలో మాస్ ఇమేజ్ ఉందని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. కాగా ఆడియన్స్ మాత్రం నానిని మన ఇంట్లో కుర్రాడిగానే చూస్తున్నారు. దీంతో నాని మాస్ హీరోగా రాణించేందుకు చాలా కష్టపడాల్సి వస్తోంది. ఎలాగైనా మాస్ ఇమేజ్ సంపాదించుకొని మరింత స్టార్డమ్ సంపాదించాలని ఆశ పడుతున్నాడు.

నాని తాజా చిత్రం 'దసరా' ఆ కోవకు చెందినదే. 'దసరా' నుంచి ఇటీవల విడుదలైన పోస్టర్ చూస్తే నానిది పక్కా మాస్ క్యారెక్టర్ గా అర్థమవుతోంది. ఈ చిత్రంతో సాలీడ్ కొడుతాననే కాన్ఫిడెన్స్ నానిలో కన్పిస్తోంది. దీంతో తన తదుపరి చిత్రాలకు ప్రస్తుతానికి సైన్ చేయడం లేదట. ఈ మూవీ బడ్జెట్ అంచనాలకు మించి పెరిగిపోతున్నా నిర్మాతలను సర్దుబాటు చేయమని కోరుతున్నాడని టాక్.

'దసరా' మూవీ తనకు 'రంగస్థలం'..'పుష్ప'.. 'కేజీఎఫ్'లా బ్లాక్ బస్టర్ ఇస్తుందని ఆశిస్తుందన్నాడు. ఇదే కనుక జరిగితే టాలీవుడ్లో తన స్థాయి మరింత పెరగడం ఖాయం కన్పిస్తోంది. నానికి ఇప్పటిదాకా ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. మాస్ ఇమేజ్ కోసం గట్టి  ప్రయత్నం చేస్తున్న నానికి 'దసరా' అలాంటి ఫలితం ఇస్తుందా? లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిందే..!


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News