కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు కొట్టుకుపోవడం సహజమే. సినీ ఇండస్ట్రీలో సైతం యువ తరం రాణిస్తున్నప్పుడు మెల్లి మెల్లిగా ఓల్డ్ జనరేషన్ ప్రభ తగ్గిపోతూ ఉంటుంది. హీరోల విషయంలో తప్ప దాదాపు మిగతా అన్నిట్లోనూ ఇదే జరుగుతుంది.
విభిన్నమైన ఐడియాలతో రోజుకో కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న తరుణంలో.. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్స్ గా రాణించిన వారు అవుట్ డేటెడ్ అవుతున్నారు. అయినప్పటికీ కొందరు యంగ్ డైరెక్టర్స్ తో పోటీ పడటానికి ప్రయత్నాలు చేస్తూనే వున్నారు.
టాలీవుడ్ లో కొన్నేళ్లపాటు మోస్ట్ డిమాండబుల్ డైరెక్టర్ గా కొనసాగిన శ్రీను వైట్ల కెరీర్ గత కొన్నేళ్లుగా ఆశించిన విధంగా సాగడం లేదు. హిట్లు వస్తున్నాయని ఒకే తరహా సినిమాలు తీయడంలో.. బోర్ గా ఫీలై జనాలు వాటిని రిజెక్ట్ చేశారు. బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాప్స్ రావడంతో.. దర్శకుడు చాలా కాలంగా సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలో మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడానికి గట్టిగా ట్రై చేసిన శ్రీను వైట్ల.. మంచు విష్ణుతో 'డీ' కి సీక్వెల్ గా 'డి అండ్ డి - డబుల్ డోస్' అనే సినిమాని అనౌన్స్ చేశాడు. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రకటనకే పరిమితమైంది. దీంతో ఇప్పుడు మ్యాచో స్టార్ గోపీచంద్ తో ఓ మూవీ చేయటానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రంతో మళ్లీ అగ్ర హీరోల దృష్టిని ఆకర్షించాలని శ్రీను ఆశ పడుతున్నారు.
తెలుగులో ప్లాప్ డైరెక్టర్ గా ముద్రపడిపోయిన మెహర్ రమేష్.. 'షాడో' తర్వాత మరో సినిమా చేయలేదు. అయితే ఇన్నేళ్లకి ఇప్పుడు తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవితో మూవీ చేసే అవకాశం అందుకున్నాడు. తమిళ్ లో విజయవంతమైన 'వేదలమ్' సినిమాని "భోళా శంకర్" పేరుతో రీమేక్ చేస్తున్నాడు.
ప్రస్తుతం సెట్స్ మీదున్న ఈ మూవీ వచ్చే యేడాది ప్రేక్షకుల ముందుకి రానుంది. భోళా శంకర్ మీద దర్శకుడు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. సినిమా ఫలితంపై ధీమాగా ఉన్నాడు. మరి ఈ మెగా గోల్డెన్ ఛాన్స్ మెహర్ రమేష్ కు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.
మాస్ అండ్ కమర్షియల్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన వి.వి. వినాయక్.. కొన్నేళ్లుగా ఆఫ్ లైన్ లో ఉండిపోయారు. ఒకప్పుడు స్టార్ హీరోలందరితో బ్లాక్ బస్టర్స్ తీసిన దర్శకుడు.. 'ఇంటెలిజెంట్' ఫ్లాప్ తర్వాత మరో చిత్రాన్ని అందించలేదు. కానీ ఇప్పుడు హిందీ చిత్రంతో సత్తా చాటడానికి చూస్తున్నాడు.
తెలుగులో సూపర్ హిట్టయిన 'ఛత్రపతి' సినిమాని వినాయక్.. హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ఇది డైరెక్టర్ కు బాలీవుడ్ డెబ్యూ. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. ఈ రీమేక్ తో ఎలాగైనా హిట్ కొట్టి సాలిడ్ కమ్ బ్యాక్ అవ్వాలని వినాయక్ భావిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.
స్వయంవరం - నువ్వే కావాలి - నువ్వు నాకు నచ్చావ్ - మన్మథుడు - మల్లీశ్వరి - జై చిరంజీవ లాంటి చిత్రాలను అందించిన దర్శకుడు కె విజయ్ భాస్కర్.. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టుకున్నారు. శివాని రాజశేఖర్ హీరోయిన్ గా.. శ్రీ కమల్ అనే కుర్రాడిని హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా చేస్తున్నారు.
ఇలా టాలీవుడ్ లో చాలామంది దర్శకులు కంబ్యాక్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద హిట్లు కొట్టి తమ ప్రభ తగ్గలేదని నిరూపించాలని తీవ్రంగా కష్టపడుతున్నారు. మరి ఈ సీనియర్ డైరెక్టర్స్ కు ఎలాంటి విజయాలు వరిస్తాయో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.