టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరొకవైపు సినిమాలను త్వర త్వరగా పూర్తి చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే మధ్య మధ్యలో కొన్ని సినిమా ఈవెంట్స్ లలో కూడా పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ దిల్ రాజుతో పెరిగిన సాన్నిహిత్యం వలన ఇప్పుడు విజయ్ సినిమా కోసం కూడా ప్రమోషన్స్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
విజయ్ వారసుడు సినిమా తమిళ్ తెలుగులో ఒకేసారి భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ సినిమాపై దిల్ రాజు భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టాడు. ఏకంగా విజయ్ కు 90 కోట్లకు పైగా పారితోషికం ఇవ్వాల్సి వచ్చింది. ఇక సినిమాపై ఏ రేంజ్ లో పెట్టుబడి పెట్టి ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను భారీ స్థాయిలోనే విడుదల చేయాలని అనుకుంటున్నారు.
డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఈ సినిమాను భారీ ధరలకు కొనుగోలు చేశారు. కాబట్టి దిల్ రాజు తప్పనిసరిగా అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో ప్రమోషన్స్ చేయాల్సి ఉంటుంది. ఇక విజయ్ కూడా మొదటిసారి తన సినిమా కోసం తెలుగులో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం రాబోతున్నాడు. అయితే ఈ క్రమంలో ప్రత్యేకంగా విజయ్ కోసం పవన్ కళ్యాణ్ ని రంగంలోకి దింపాలి అని దిల్ రాజు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే పవన్ వస్తే బయటకు ఏ విధంగా సంకేతాలు వెళ్తాయి అనే ప్రశ్న కూడా ఉంది.
ఎందుకంటే మరోవైపు సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య కూడా రాబోతోంది. ఇప్పటికే థియేటర్ల పంపకాల విషయంలో దిల్ రాజు పై తీవ్రస్థాయిలో విమర్శలు వెలబడుతున్నాయి. ఇక ఈ క్రమంలో తన అన్నయ్య సినిమాను పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ అలా వెళితే ఇది జనాలకు ఏ విధంగా చేరువవుతుంది అనేది కొంత అనుమానాన్ని కలిగిస్తోంది. ఒక విధంగా విజయ్ పవన్, ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఆ హీట్ అయితే మామూలుగా ఉండదు. తప్పకుండా తెలుగులో సినిమాకు మంచి హైప్ అయితే పెరుగుతుంది.
కానీ వచ్చిన చిక్కల్లా మెగాస్టార్ ఫ్యాన్స్ తోనే. ఇది పాజిటివ్ గా తీసుకుంటే తప్పులేదు. కానీ ఏమాత్రం నెగిటివ్ కామెంట్స్ పెరిగినా కూడా జనసేనపై కూడా ఎంతో కొంత ప్రభావం చూపించవచ్చు. మరి నిజంగా పవన్ కళ్యాణ్ ఈవెంట్ కు వస్తాడా లేదా అనేది చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.