గత ఏడాది చివర్లో విడుదల అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాకు ఇప్పటికే సీక్వెల్ గా పుష్ప పార్ట్ 2 షూటింగ్ ప్రారంభం అవ్వాల్సి ఉంది. పుష్ప పార్ట్ 1 విడుదలైన వెంటనే పార్ట్-2 ని షురూ చేయబోతున్నట్లుగా దర్శకుడు సుకుమార్ ప్రకటించాడు.
పుష్ప ప్రమోషన్ సమయంలో పుష్ప పార్ట్ 2 కి సంబంధించిన షూటింగ్ వెంటనే మొదలు పెడతామని ప్రకటించిన నేపథ్యంలో పుష్ప 2 మరీ ఎక్కువ లేట్ కాకుండా వెంటనే థియేటర్లకు వస్తుందని అంతా భావించారు.
ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే పుష్ప పార్ట్ 2 ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. మొదటి నుండి కూడా ఈ ఏడాది చివర్లో డిసెంబర్ నెలలోనే పుష్ప పార్ట్ 2 విడుదల అవుతుందని అంతా భావించారు. మేకర్స్ కూడా ఆ విషయాన్ని చెబుతూ వచ్చారు.
కానీ డిసెంబర్ లో సినిమా విడుదలయ్యే అవకాశాలు లేవేమో అనిపిస్తుంది. ఎందుకంటే పుష్ప పార్ట్ 2 ముందు అనుకున్న బడ్జెట్ కంటే కంటే కాస్త భారీగా.. ప్రత్యేకంగా తీయాలని దర్శకుడు సుకుమార్ మరియు హీరో అల్లుఅర్జున్ భావిస్తున్నారట.
పుష్ప సినిమా హిందీ ప్రేక్షకులకు బాగా నచ్చింది. అక్కడ ఏకంగా వంద కోట్లు వసూళ్లు నమోదయ్యాయి. పుష్ప పార్ట్ 2 అక్కడికి వెళ్లాలంటే అంతకు మించి ఉండాలి. కనుక పుష్ప హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఉండేలా దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు. తెలుగు ప్రేక్షకులకు మరియు హిందీ ప్రేక్షకులకు వేరు వేరుగా స్క్రీన్ ప్లే ను ప్లాన్ చేయడంతో పాటు సంగీతం కూడా వేరు వేరు గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల విడుదలైన రాధేశ్యామ్ సినిమాకు కూడా ఇదే ఫార్ములాను ఉపయోగించారు. తెలుగు మరియు హిందీ సినిమాల్లో మ్యూజిక్ వేర్వేరు ఉండటంతో పాటు.. కొన్ని సన్నివేశాల విషయంలో కూడా వేరు వేరుగా నటీనటులను నటింపజేశారు. మొత్తానికి రాధేశ్యామ్ తరహాలోనే పుష్ప పార్ట్ 2 ను కూడా నార్త్ మరియు సౌత్ లో వేరు వేరుగా చూపించే ప్రయత్నంలో దర్శకుడు సుకుమార్ ఉన్నాడు.
రాధేశ్యామ్ ఆ ప్రయత్నం కొంత వరకు ఫలితాన్ని ఇచ్చాయనే టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు అదే తరహాలో సుకుమార్ కూడా నార్త్ మరియు సౌత్ ప్రేక్షకులకు వేరు వేరు అన్నట్లుగా స్క్రీన్ ప్లే మరియు మ్యూజిక్ ని డిజైన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. రాధేశ్యామ్ సినిమాకు మిశ్రమ స్పందన దక్కింది. అయినా కూడా పుష్ప పార్ట్ 2 కి అదే తరహా వ్యూహం ను అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పుష్ప పార్ట్ 2 అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం తో సుకుమార్ మరియు అల్లు అర్జున్ ఉన్నారు. త్వరలోనే షూటింగ్ ను మొదలు పెట్టి విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తారేమో చూడాలి.