జేమ్స్ బాండ్ ను RRR ఢీకొంటారా?

Update: 2021-01-23 02:30 GMT
ప్ర‌పంచ సినీ చ‌రిత్ర‌లో జేమ్స్ బాండ్ మూవీస్ కు ఉన్న ఆద‌ర‌ణ ఎలాంటిదో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. యాక్ష‌న్ సినిమాల‌ను ఇష్ట‌ప‌డేవారు జేమ్స్ బాండ్ సినిమాల‌ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ సిరీస్ లో రాబోతున్న మూవీ 'నో టైం టూ డై'. కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తున్న మూవీ.. తాజాగా మరోసారి పోస్ట్ పోన్ అయ్యింది. అయితే.. లేటెస్ట్ గా ప్రకటించిన మూవీ రిలీజ్ డేట్ తెలుగు ప్రేక్షకులకు ఆసక్తికరంగా మారింది.

వాస్తవానికి ఈ జేమ్స్ బాండ్ మూవీ గత ఏడాది నవంబర్ 20 న విడుదల కావాల్సి ఉంది. కానీ.. అమెరికాలో కరోనా విజృంభించ‌డంతో రిలీజ్ ను వాయిదా వేశారు. ఈ ఏప్రిల్ లో రిలీజ్ చేయాల‌నే ఆలోచ‌న చేసినప్పటికీ.. యూఎస్ లో క‌రోనా తీవ్ర‌త త‌గ్గ‌లేదు. అంతేకాకుండా.. ఇప్పుడు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ మొద‌లైంది. దీంతో.. మేక‌ర్స్ సినిమా రిలీజ్ ను మ‌రోసారి పోస్ట్ పోన్ చేశారు.

లేటెస్ట్ డేట్ ప్ర‌కారం.. ఈ ఏడాది అక్టోబర్ 8 న ఈ చిత్రాన్ని వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అప్ప‌టిలోపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ పూర్త‌వ‌డంతోపాటు.. క‌రోనా నియంత్ర‌ణ‌లోకి వ‌స్తుంద‌ని ఆశిస్తున్నారు. 2021 ఏడాది స‌గం పూర్తయ్యేలోపు ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ‌తాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. మొత్తం స‌ద్దుమ‌ణిగిన త‌ర్వాతే సినిమా రిలీజ్ చేద్దామ‌ని అక్టోబ‌ర్ కు షిఫ్ట్ అయ్యారు.

అయితే.. ఇక్క‌డ ఆసక్తికరమైన విషయం ఉంది. రాజమౌళి ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న RRR చిత్రాన్ని కూడా ఈ అక్టోబ‌ర్ లోనే రిలీజ్ చేయాల‌ని జ‌క్క‌న్న‌ప్లాన్ చేస్తున్నాడ‌ని వార్తలు వస్తున్నాయి. ఈ స‌మ్మ‌ర్ లోపు షూటింగ్ ఫినిష్ చేసి, ద‌స‌రాకు సినిమాను లైన్లో నిల‌బెట్టాల‌న్న‌ది రాజ‌మౌళి ప్లాన్. అయితే.. వ‌ర‌ల్డ్ వైడ్ గా మోస్ట్ అవైటెడ్ మూవీ అయిన జేమ్స్ బాండ్ కూడా అదే టైంలో వ‌స్తుండ‌డంతో.. ఈ రెండు సినిమాలూ క్లాష్ అవుతాయా? అనే చ‌ర్చ మొద‌లైంది.

ఈ నేప‌థ్యంలో డిస్ట్రిబ్యూట‌ర్స్ కూడా రాజ‌మౌళిని క‌లిసి సినిమా రిలీజ్ డేట్ షిఫ్ట్ చేయాల‌ని కోరార‌ట‌. ద‌స‌రాకు కాకుండా.. సంక్రాంతి బ‌రిలో నిల‌పాల‌ని సూచించిన‌ట్టు స‌మాచారం. ఎలాగూ లేట్ అయ్యింది కాబ‌ట్టి.. దాన్ని సంక్రాంతి వ‌ర‌కూ పొడిగిస్తే.. క‌లెక్ష‌న్లు బాగుంటాయ‌ని చెప్పిన‌ట్టు తెలిసింది. మ‌రి, జ‌క్క‌న్న ఏం చేస్తాడు? జేమ్స్ బాండ్ తో యుద్ధానికి ‘సై' అంటూ  RRRను దసరాకే రిలీజ్ చేస్తాడా? లేదా సంక్రాంతికి షిఫ్ట్ చేస్తాడా? అన్నది చూడాలి.
Tags:    

Similar News