నాన్ - డార్లింగ్ రికార్డ్స్ తప్పవా..?

Update: 2019-08-12 06:19 GMT
మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మొదటి నుంచి హీరో సెంట్రిక్ ఇండస్ట్రీ.  స్వర్గీయ దాసరి నారాయణరావుగారి లాంటివారు డైరెక్టర్ కు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ కల్పించారు.  ఇక విశ్వనాథ్.. బాపు లాంటి పలువురు లెజెండరీ డైరెక్టర్స్ సినిమాలను హీరో హీరోయిన్ ఎవరన్న దానితో సంబంధం లేకుండా చూసేవారు. అయితే ఇలాంటి డైరెక్టర్లు ఈ జెనరేషన్ కూడా ఉన్నప్పటికీ రికార్డుల విషయం వచ్చేసరికి అంతా హీరోల హంగామానే.  కానీ 'బాహుబలి' తో రాజమౌళి వాటికి పూర్తిగా చెక్ పెట్టాడు.

అయితే దీన్ని అలుసుగా తీసుకున్న చాలామంది డార్లింగ్ ప్రభాస్ ను రికార్డ్స్ నుండి పక్కకు తప్పించేందుకు నాన్ - బాహుబలి రికార్డ్స్ అంటూ కొత్త పదాన్ని.. రికార్డుల్లో కొత్త కేటగిరీని సృష్టించారు.  అంటే రికార్డులన్నిటికీ ప్రభాస్ పేరును దూరంగా ఉంచుతారన్నమాట.  మరి కొంతమంది అయితే ప్రభాస్ ఘనతను తగ్గించేందుకు 'బాహుబలి' అంటే రాజమౌళి సినిమా అని.. ప్రభాస్ గొప్పదనమేమీ లేదన్నట్టుగా కొత్త లాజిక్ కూడా తీసుకొచ్చారు.  అయితే ఇదే రాజమౌళి ఇతర హీరోలతో బ్లాక్ బస్టర్లు సాధిస్తే మాత్రం అది ఆ సినిమాలో నటించిన స్టార్ల ఘనత అంటారు!

కట్ చేస్తే ఇప్పుడు 'సాహో' రిలీజ్ కు సమయం ఆసన్నమైంది.  మన బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టార్ హీరోల హయ్యెస్ట్ బిజినెస్ కూడా 'సాహో'కు జరిగే ప్రీ రిలీజ్ బిజినెస్ లో సగం కూడా లేదు.  ఇక 'సాహో' ట్రైలర్ వ్యూస్ రికార్డ్స్ కూడా అలానే ఉన్నాయి. ఈ ఊపు చూస్తుంటే సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా వందల కోట్ల వసూళ్లను అవలీలగా సాధించేలా ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈలెక్కన 'బాహుబలి' రికార్డులకు 'సాహో' ఎసరు పెట్టినా ఎవరూ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. 

'బాహుబలి' సమయంలో అంటే క్రెడిట్ పూర్తిగా రాజమౌళి కి ఇచ్చి రికార్డుల నుంచి ప్రభాస్ ను పక్కకు తప్పించగలిగారు. ఇప్పుడు 'సాహో' కనుక కలెక్షన్ రికార్డులు సృష్టిస్తే ఏం చేయాలి?  నాన్ ప్రభాస్ రికార్డ్స్.. నాన్ డార్లింగ్ రికార్డ్స్.. నాన్ సాహో రికార్డ్స్ అని అప్పుడు కూడా ప్రభాస్ ను రికార్డుల నుంచి పక్కకు తప్పించడం కుదురుతుందా?  రాజమౌళి అంటే దర్శకధీరుడు కాబట్టి అలా ప్రభాస్ ను పక్కన పెట్టినా పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కాలేదు. ఇప్పుడు 'సాహో' సినిమాకు దర్శకుడు యువకుడైన సుజిత్.  సినిమా బిజినెస్.. కలెక్షన్స్ అంతా ప్రభాస్ లెక్కలోనే పడతాయి. ఇప్పుడు ఏం చేస్తారబ్బా..? 

Tags:    

Similar News